SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 25న పాఠశాలలకు హాలిడే.. ఆర్డర్ జారీ చేసిన సర్కార్!

September 25 School Holiday: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. అనంత్ చతుర్దశి, గణేష్ నిమజ్జనం సందర్భంగా 2026 సెప్టెంబర్ 25న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Written By Bhoomi
Published: Sep 22, 2026, 10:09 AM IST | Updated: Sep 22, 2026, 10:11 AM IST
Image Credit: September 25 School Holiday
Join

September 25 School Holiday: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. అనంత్ చతుర్దశి, గణేష్ నిమజ్జనం సందర్భంగా 2026 సెప్టెంబర్ 25న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుల నిమజ్జన కార్యక్రమాలు పెద్దెత్తున జరగనున్నందున విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత ద్రుష్ట్యా ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది.

మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 25వ తేదీ 2026 శుక్రవారం నాడు సెలవు వర్తిస్తుంది. అనంత్ చతుర్దశి రోజున వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి వేడుకలు ప్రారంభమైన 10వ రోజున అనంత్ చతుర్దశి సందర్బంగా వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తుంటారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భారీ ఊరేగింపులు నిర్వహించడంతోపాటు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొంటారు. ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తారు. పాఠశాలలకు సెలవు నేపథ్యంలో విద్యార్థులు  విషయాన్ని గమనించి.. తిరిగి స్కూల్లు ప్రారంభమయ్యే తేదీపై సంబంధిత పాఠశాల యాజమాన్యం నుంచి సమాచారం పొందాలని అధికారులు సూచించారు.

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వినాయక నిమజ్జనం సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా భారీగా నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 25వ తేదీన శుక్రవారం వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించినట్లయితే.. ఆ తర్వాత సెప్టెంబర్ 26 శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కావడంతో మరో 3 రోజులు కూడా విరామం వస్తుంది.

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

 

Also Read:  మొత్తానికి శాంతించిన బంగారం ధరలు.. సెప్టెంబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!!

 

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES