Maharashtra School: లంచ్ బాక్స్‌లో మెంతికూర తెచ్చినందుకు జరిమాన.. మహారాష్ట్రలోని స్కూల్లో వింత ఘటన.. మ్యాటర్ ఏమిటంటే..?..
Methi curry in lunch box row in Maharashtra: మహారాష్ట్రలోని భయందర్ శివారులో ఉన్న ప్రైవేటు స్కూల్ లో లంచ్ బాక్స్ లో మెంతికూర తీసుకెళ్లడం పెద్ద రచ్చగా మారింది. దీంతో కొంత మంది పిల్లలపై యాజమాన్యం 50 రూపాయలు జరిమాన విధించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
Maharashtra Student fined rs 50 over cooked methi in lunchbox: మహారాష్ట్రలోని థానే స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భయందర్ శివారులో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ లొ కొంత మంది విద్యార్థులు ఇటీవల లంచ్ బాక్స్ లో మెథీ కూర తెచ్చుకున్నారు. దీంతో యాజమాన్యం వారికి రూ. 50 చొప్పున జరిమాన విధించింది. జైన పండుగ పర్యుషణ్ సందర్భంగా మేథీ తెచ్చినందుకు జరిమాన విధించినట్లు తెలుస్తొంది. దీనికి బదులుగా స్కూల్ ఆవరణలో క్యాంటిన్ లో తినాలని కూడా ఆదేశించారని సమాచారం. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు స్కూల్ కు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి.
పాఠశాలలోని అధికశాతం జైన విద్యార్థులు ఉండటం వల్ల.. వారి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, దుంపకూరలు, కొన్ని ఆకుకూరలతో సహా కొన్ని రకాల కూరగాయలను టిఫిన్‌లో చేర్చకూడదని ఆ పాఠశాల విధానం నిర్దేశిస్తుంది. ఆ నిబంధనలను ఉల్లంఘించినందుకు కొంత మందిపై క్రమశిక్షణా చర్యగా ఈ జరిమానా విధించినట్లు తెలుస్తొంది. దీనిపై వివాదం రాజుకుంది.
పాఠశాలకు పౌర విద్యావిభాగం నోటీసు..
ఈ ఘటనపై వివరణ కోరుతూ.. MBMC విద్యా విభాగం పాఠశాల యాజమాన్యానికి షో-కాజ్ నోటీసు జారీ చేసింది. విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకునే ఆహారంపై పాఠశాలలు ఆంక్షలు విధించడం ఏంటని విద్యాశాఖాధికారులు అధికారులు మండిపడ్డారు. ఈ నోటీసుల్లో.. ఆ నోటీసులో విద్యార్థుల ప్రాథమిక హక్కులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, విద్యా హక్కు చట్టం (RTE)లోని నిబంధనలను ఉటంకిస్తూ, పాఠశాల సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వివాదంపై స్కూల్ సిబ్బంది ఏమని చెప్పారంటే..?..
తమ పాఠశాలలో.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లిదండ్రులకు టిఫిన్ మార్గదర్శకాలను తెలియజేయడం జరిగిందని వెల్లడించింది. అవి జైన సమాజం యొక్క మతపరమైన, ఆహారపు సున్నితత్వాలను గౌరవించేందుకే రూపొందించబడ్డాయని పాఠశాల అధికారులు పౌర సంస్థకు తెలిపినట్లు సమాచారం. ₹50 జరిమానా అనేది 'రుసుము' కాదని, పదేపదే ఉల్లంఘనలకు తీసుకునే క్రమశిక్షణా చర్య అని వారు స్పష్టం చేశారు.