SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్‌లను మించి సంక్షేమ పథకాలను అమలులో కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు. తాజాగా దీపావళి కానుకగా సీఎం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 100 లకే 10 రకాల కూరగాయల అందించబోతున్నట్టు ప్రకటించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 10:17 AM IST | Updated: Nov 07, 2026, 10:20 AM IST
Image Credit: Tamil nadu CM New Scheme (Source/AI)
Join

CM Vijay Deepawali Dhamaka: దీపావళి స్పెషల్.. రూ.100కే 10 రకాల కూరగాయలు..  ఆలోచించిన ఆశా భంగం.. అన్నట్టుగా మన దేశంలో సంక్షేమ పథకాల అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే రాష్ట్రం తమిళనాడు అని చెప్పాలి. ఇక్కడ ఓటర్లను ఆకట్టుకోవడానికి అప్పటి పాలకైన డీఎంకే, ఏఐఏడీఎంకే అధినేతలైన కరుణానిధి, జయలలితలు ఒకరిని మించి మరొకరు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో దాదాపు సక్సెస్ అయ్యారు కూడా.దీంతో రాష్ట్రం ఆర్ధికంగా కుదేలైనట్టు ఆర్ధిక వేత్తలు చెప్పిన మాట. ఇక విజయ్ పాలనలో కొత్తతనం చూపిస్తాడనుకుంటే.. గత డీఎంకే,  ఏఐఏడీఎంకే మాదిరి పాలన కంటే తన సీటు కాపాడుకోవడానికే ఎక్కువ తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తుందనే వాదన కొంత మంది విశ్లేషకులు చెబుతున్న మాట. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అందుకునే తాయిలాల కంటే పేద, సామాన్య మధ్య తరగతికి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదనే వాళ్లున్నారు.

తాజాగా తమిళనాడు ప్రజలకు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు  సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘వెట్రి’ పథకం కింద కేవలం రూ.100కే 10 రకాల నిత్యావసర కూరగాయలను అందించనున్నట్లు ప్రచారంలో ఉన్న పోస్టర్‌లో ఉంది.
పథకం పేరు: ‘వెట్రి స్పెషల్ వెజిటబుల్ ప్యాక్’

ప్రారంభించిన ప్రభుత్వం: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం

ప్యాక్ ధర: 100 రూపాయలు.  కూరగాయల రకాలు: 10

మొత్తం బరువు: సుమారు 2.55 నుంచి 2.60 కిలోలు వరకు ఉంటుందట.

విక్రయ తేదీలు: నవంబర్ 5 నుంచి నవంబర్ 7, 2026 వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఆల్రెడీ ప్రారంభమైన పథకం.. ఈ రోజు ఎండ్ కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 218 సహకార విక్రయ కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. చెన్నైలో ప్రత్యేకంగా 4 మొబైల్ కూరగాయల విక్రయ వాహనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క వినియోగదారుడికి ఒక ప్యాక్ మాత్రమే ఇస్తారు. 
రేషన్ షాపుల్లో కాకుండా ఎంపిక చేసిన సహకార దుకాణాల్లో విక్రయించనున్నారు. మొత్తంగా ఒక్కో కూరగాయ పావు కిలో వరకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ఇంత హడావుడి చేయడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES