SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tamil Nadu 15 Days Paternity Leave: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆ రాష్ట్రంలో పురుషులకు 15 రోజులు పితృత్వ సెలవులు!

Tamil Nadu 15 Days Paternity Leave Rules: తమిళనాడు ప్రభుత్వం పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భార్య ప్రసవ సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి కుటుంబంతో సమయం గడిపేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. డెలివరీకి 15 రోజుల ముందు నుంచి లేదా శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఈ సెలవులను వినియోగించుకోవచ్చు.

Written By Harish Darla
Published: Nov 26, 2026, 16:24 IST | Updated: Nov 26, 2026, 16:26 IST
Join

Tamil Nadu 15 Days Paternity Leave Rules: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇకపై రాష్ట్రంలోని పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులను మంజూరు చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన సమయంలో భార్యకు అండగా ఉండడం సహా నవజాత శిశువను సంరక్షణ కోసం తండ్రి కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్యోశంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విజయ్ సర్కార్ తెలియజేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల్లో మరింత ఆసక్తిని రేపింది.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. అర్హత కలిగిన పురుష ప్రభుత్వ ఉద్యోగులు తమ భార్య ప్రసవానికి 15 రోజుల ముందు నుంచి పితృత్వ సెలవులను తీసుకునేందుకు అవకాశం ఉంది. అదే విధంగా బిడ్డ జన్మించిన తేదీ నుంచి ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు. దీంతో ఉద్యోగులకు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా సెలవులను ప్లాన్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

సాధారణంగా ప్రసవ సమయంలో మహిళలకు శారీరకంగా, మానసికంగా ఎంతో సహాయం అవసరం ఉంటుంది. అదే సమయంలో పుట్టిన బిడ్డ సంరక్షణ, కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి అందుబాటులో ఉండటం తల్లికి ఎంతో ఉపశమనం కలిగించడంతో పాటు శిశువు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషించవచ్చు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పితృత్వ సెలవుల విధానం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ప్రసూతి సెలవులు సుదీర్ఘకాలం పాటు అమల్లో ఉండగా.. ఇప్పుడు పురుష ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పితృత్వ సెలవులను కల్పించడం ద్వారా కుటుంబ బాధ్యతల్లో మహిళలతో పాటు పురుషుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే పితృత్వ సెలవుల విధానాన్ని అమలు చేస్తున్న కేరళ, సిక్కిం, హర్యానా వంటి రాష్ట్రాల సరసన తమిళనాడు చేరినట్లు ఈ వార్త పేర్కొంటోంది.

ఈ నిర్ణయం ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. పితృత్వ సెలవులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ ఉత్తర్వుల్లోని పూర్తి వివరాలను ఉద్యోగులు సంబంధిత శాఖల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వ తాజా నిర్ణయం ఉద్యోగ జీవితంతో పాటు కుటుంబ జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని అందిస్తోంది. తండ్రులు తమ బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో కుటుంబంతో గడిపేందుకు ఈ 15 రోజుల సెలవులు ఉపయోగపడనున్నాయి.

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES