Mlc somu veerraju fires on ysrcp leaders in Rajahmundry: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమిల మధ్య పలు చోట్ల రాళ్లదాడులు జరిగాయి. దీంతో పోలీసులు రంగలోకి దిగి కార్యకర్తల్నిచెదరగొట్టారు. ఈ క్రమంలో ఏపీలోని రాజమహేంద్ర వరం నగరపాలక సంస్థ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రంను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి పోలీసులతో వాగ్వాదంకు దిగారు.
రెండు తొడలు కొట్టి స్థానిక వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన కాతేరు కింగ్ సోము వీర్రాజు ... ఎవరైనా ఒక తొడ గొట్టి సవాల్ చేస్తారు...సోము అంకుల్ అంటే something special అందుకే రెండు తొడలు కొట్టుకున్నాడు https://t.co/RvN04UJiSo
— మన ప్రకాశం (@mana_Prakasam) November 26, 2026
ఏపీలోని రాజమండ్రిలో నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ఈ క్రమంలో 62వ డివిజన్ పరిధిలోని మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ శ్రేణులు భారీగా చేరుకొవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్దకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేరుకున్నారు. రూల్స్ ను అతిక్రమించి ఇంత మంది వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నినాదాలు చేస్తు కొంత మంది సోమువీర్రాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆయన ఆవేశంలో ఊగిపోతు తన రెండు తొడల్ని పదే పదే కొట్టుకుంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తన మీదకు రావాలని ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని వారితో కూడా వాగ్వాదంకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు నచ్చ చెప్పి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.