SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tecno Spark 50S 5G లాంచ్.. ధర రూ.19,999 నుంచే.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

Tecno Spark 50s: శుక్రవారం భారత మార్కెట్‌లోకి టెక్నో స్పార్క్ 50s 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో కూడా లాంచ్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 04:40 PM IST | Updated: Oct 16, 2026, 04:41 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Tecno Spark 50s News: బడ్జెట్ ధరల్లో అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) విడుదల చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే ఈ కంపెనీ శుక్రవారం భారత్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ టెక్నో స్పార్క్ 50s 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టెక్నో స్పార్క్ 50S 5G ఫోన్‌ ధర వివరాలు..
టెక్నో స్పార్క్ 50S 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది ఇప్పుడు భారత్‌లో రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా.. రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంటుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది..

ఈ మొబైల్‌ బ్రీజ్ బ్లూ కలర్‌తో పాటు బర్గండీ రెడ్ రంగులలో అందుబాటులోకి వచ్కచ్చింది.. అంతేకాకుండా టెక్నో స్పార్క్ 50S 5G అక్టోబర్ 20వ తేదీ నుంచి అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయాలకు సిద్ధంగా ఉండబోతున్నట్లు కంపెనీ ఓ పోస్టర్‌లో కూడా తెలిపింది.

టెక్నో స్పార్క్ 50S 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో HD+ సపోర్ట్‌తో పాటు 720 x 1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78-అంగుళాల LCD టచ్‌స్క్రీన్ డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.. ఈ మొబైల్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో విడుదలైంది.

అంతేకాకుండా ఈ చిప్‌సెట్‌లో 2.0 GHz క్లాక్ స్పీడ్‌తో ఆరు ఎఫిషియెన్సీ కోర్లను కూడా అందుబాటులోకి ఉంచింది. దీంతో పాటు 2.5 GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు అందుబాటులో ఉన్నాయి.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లైట్ సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్‌తో అద్భుతమైన 50-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీడియో కాల్స్ కోసం ఇందులో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఇవేకాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES