మనీ ప్లాంట్ మొక్క అంటే చాలామందికి ఇష్టం. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ధన లాభం కలగడమే కాకుండా, పాజిటివిటీ కూడా పెరుగుతుంది. తులసి లేదా కలబంద లాగే చాలామంది మనీ ప్లాంట్‌ను కూడా పెంచుతుంటారు. ఈ తీగ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. మనీ ప్లాంట్ ఆకులు పచ్చగా ఉన్నప్పుడే చూడటానికి బాగుంటాయి, కానీ కొన్నిసార్లు ఆకులు వడలిపోయి, పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. మొక్క పూర్తిగా పాడవకముందే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా, ఆకులను మళ్లీ పచ్చగా, కళకళలాడేలా చేసి మొక్కను బతికించవచ్చు. మనీ ప్లాంట్ ఇండోర్ లేదా అవుట్డోర్ ప్లాంట్‌గా పెంచుకోవచ్చు. ఆకులు తాజాగా, పచ్చగా ఉంటే మొక్క అందం మరింత పెరుగుతుంది. అయితే మొక్కకు అతిగా నీరు పోయడం, తగినంత నీరు పోయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం లేదా పోషకాలు అందకపోవడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కకు నీరు పోసేటప్పుడు బ్యాలెన్స్ గా పోయాలి, అతిగా పోయకూడదు. అలాగే మొక్క ఉన్న కుండీలో డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలి, అంటే నీరు సులభంగా బయటకు వెళ్లాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, మొక్కకు అవసరమైన ఖనిజాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పుడే అది ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఒకవేళ మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారితే, మొక్క మొదట్లో బూడిదను వేయాలి. బూడిదలో ఉండే ఖనిజాల వల్ల మొక్క మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. కొన్నిసార్లు మొక్క మొదట్లో ఫంగస్ పెరగడం వల్ల కూడా మొక్క బలహీనపడి ఆకులు రాలిపోతుంటాయి. అటువంటప్పుడు ఇంట్లో ఉండే బేకింగ్ సోడాను మొక్క మొదట్లో వేయడం అనే చిన్న చిట్కాతో ఫంగల్ సమస్యను తగ్గించవచ్చు. దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
మనీ ప్లాంట్‌కు ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు, మొక్క మొదలులో తడి ఆరిపోయినప్పుడు పోస్తే సరిపోతుంది. కుండీకి డ్రైనేజీ రంధ్రాలు కూడా సరిగ్గా ఉండాలి. మరీ ఎక్కువ తేమ ఉంటే వేర్లు బలహీనపడి, ఆకులు పసుపు రంగులోకి మారి, కాండం కూడా బలహీనంగా మారుతుంది.
మనీ ప్లాంట్‌ను ఇండోర్ ప్లాంట్‌గా కూడా ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఇందులో పోషకాలు సరిగ్గా ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. మొక్క పాడవకుండా ఉండాలంటే ఎప్పుడూ నేరుగా ఎండలో పెట్టకూడదు, అప్పుడప్పుడు మాత్రమే సన్ లైట్ తగిలేలా చూసుకోవాలి.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).