రైలు ఆలస్యమైనా.. క్యాన్సిల్ అయినా..! రూపాయి పోకుండా రీఫండ్ పొందేలా IRCTC నిబంధనలు ఇవే!
భారతీయ రైల్వేలో ప్రయాణం ఎంతో సులభతరం. ఇది గమ్యస్థానానికి అతి తక్కువ సమయంలో చేరవేస్తుంది. ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే ఇక్కడ టికెట్ ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే, ఒక్కోసారి మీరు బుక్ చేసుకున్న రైలు రద్దయిపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. అటువంటప్పుడు ప్రయాణికులకు డబ్బు రిఫండ్ అవుతుందా లేక వేరే ట్రైన్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుందా అనే IRCTC రిఫండ్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Train Delay Refund Rules: భారతీయ రైల్వే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల IRCTC కి సంబంధించిన కొత్త వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో తక్కువ సమయంలో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. భారతీయ రైల్వేలో ప్రయాణించాలంటే 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. సాధారణ టికెట్లు ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. తత్కాల్ టికెట్లు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఒకవేళ రైలు రద్దయిపోయినా లేదా ఆలస్యమైనా ప్రయాణికులకు రీఫండ్ ఇస్తారా? లేదా? వేరే సర్వీస్ అందిస్తారా? అనే విషయం ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి. భారత రైల్వేలో టికెట్ రిఫండ్ పూర్తిగా లేదా పాక్షికంగా వస్తుంది. ఆన్‌లైన్ టికెట్ల విషయంలో రిఫండ్ కోసం మాన్యువల్‌గా TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది.
అయితే, మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, కౌంటర్ వద్దే ఒరిజినల్ టికెట్‌ను తీసుకువెళ్లి రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే మాత్రమే రిఫండ్ లభిస్తుంది. ఒకవేళ మీరు మీ అవసరాల కోసం రైలును క్యాన్సిల్ చేయాలనుకుంటే, దానికి ఒక సమయం ఉంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే నిర్ణీత ఫీజు కట్టి 50 శాతం టికెట్ ధరను పొందవచ్చు.
చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రాదు. కాబట్టి డబ్బులు వృథా కాకుండా ఉండాలంటే చార్ట్ తయారీకి ముందే క్యాన్సిల్ చేసుకోవాలి. చార్ట్ తయారీకి ముందే క్యాన్సిల్ చేస్తే, ఆ టికెట్‌ను వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తారు. ఒకవేళ మీ వద్ద RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే మీకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది; రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు క్యాన్సిల్ చేస్తే క్లెరింగ్ ఛార్జీలు లేకుండా మిగిలిన డబ్బును రిఫండ్ చేస్తారు.
కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్లు కూడా సాధారణంగా రిఫండ్ అవ్వవు. అయితే, రైలు పూర్తిగా రద్దయినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైనా మీకు టికెట్ డబ్బులు పూర్తిగా రిఫండ్ చేస్తారు. ఇది తత్కాల్ టికెట్లకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, 'Not To Travel' ఆప్షన్‌ను ఎంచుకుని ఫుల్ రిఫండ్ పొందవచ్చు. ఆన్‌లైన్ యూజర్లు కచ్చితంగా చార్ట్ ప్రిపేషన్‌కు ముందే TDR ఫైల్ చేయాలి, కౌంటర్ యూజర్లు నేరుగా వెళ్లి డబ్బులు పొందవచ్చు.
Read ALso: ఆధార్‌కు ఈమెయిల్ ఐడీని ఉచితంగా ఎలా లింక్ చేయాలి? డిసెంబర్ 31లోపు మొబైల్‌లోనే ఇలా చేసేయండి!
కొన్ని రైళ్ల రూట్ మళ్లింపు జరిగినప్పుడు, మీరు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. అధికారిక అప్‌డేట్స్ చూసి, మీ స్టేషన్ అందుబాటులో ఉంటే ప్రయాణించవచ్చు. లేదంటే TDR ఫైల్ చేస్తే ఫుల్ రిఫండ్ వస్తుంది. అయితే, అనధికారిక సోషల్ మీడియా వార్తలను ఎప్పుడూ నమ్మకూడదు, ఎందుకంటే అక్కడ రైళ్లు రద్దయినట్లు తప్పుడు సమాచారం ఉండవచ్చు. అధికారిక యాప్‌లో లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఉత్తమం.
టికెట్ రిఫండ్ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయండి. IRCTC అధికారిక హెల్ప్ సెక్షన్‌లో మీరు మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు, దీనికి రైల్వే వారి మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది.