SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

Uttar Pradesh Viral Love Story: ఓ ప్రేమ జంట అనుకోకుండా అర్ధరాత్రి గ్రామ చివరులో కలుసుకున్నారు. అయితే, ఇదే సమయంలో యువతి తండ్రి, తమ్ముడు రావడంతో ఆ యువకుడిని పట్టుకుని కొట్టి.. ఆగ్రహంతో పెళ్లి చేశారు.. ఈ సమయంలోనే ఆ యువకుడు రెండు చోట్ల దెబ్బలు తిన్నాడు. ఎందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 04:35 PM IST | Updated: Nov 11, 2026, 04:37 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Uttar Pradesh Viral Love Story: రహస్యంగా కలుసుకున్న ఓ ప్రేమజంట కథ అనుకోని మలుపులు తిరిగి చివరకు పెళ్లిపీటల దాకా చేరింది.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. అయితే, ఈ ఘటనలో ప్రేమకథ కంటే.. ఇరు కుటుంబాలు వ్యవహరించిన తీరు.. జరిగినట్లు చెబుతున్న దాడులే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అసలు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ ప్రాంతానికి చెందిన సంజయ్ నిషాద్ అనే యువకుడు తన లవర్‌ను చూసేందుకు అర్ధరాత్రి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు.. వీరిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో అనుకోకుండా యువతి తండ్రి.. సోదరుడు అక్కడికి వచ్చారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న యువతి బంధువులు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కోపంతో వారు సంజయ్‌ను బంధించి.. రాత్రంతా విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది..

రాత్రంతా దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు.. మరుసటి రోజు ఉదయానికి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే వీరిద్దరికీ వివాహం జరిపించి.. సంజయ్‌తో పాటు పంపించివేశారు.. కథ అక్కడితో ముగిసిందని భావిస్తే అంతే సంగతి.. నవవధువును తీసుకుని సంజయ్ తన స్వగ్రామానికి.. సొంత ఇంటికి వచ్చాడు. అయితే.. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాడన్న కారణంతో సంజయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.. నచ్చని వివాహం చేసుకున్నాడంటూ.. సొంత కుటుంబ సభ్యులు కూడా సంజయ్‌పై చేతులు చేసుకున్నట్లు సమాచారం... ఇలా అటు యువతి తరపు వారి చేతిలో.. ఇటు కన్నవారి చేతిలో దెబ్బలు తిన్న యువకుడి దుస్థితి చెప్పరాకుండా అయిపోయింది.

ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇది ఏ గ్రామంలో జరిగింది? ఏ తేదీన జరిగింది? దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏదైనా ఫిర్యాదు నమోదైందా? అన్న వివరాలు ఎక్కడా స్పష్టంగా కలేవు... వార్తా సంస్థలు కూడా ఈ ఘటనపై అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.. కానీ వీరికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES