Vivo X500 సిరీస్ వచ్చేస్తోంది.. X500, ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు, ఫీచర్లు ఇవే!
Vivo X500 Series: మార్కెట్‌లోకి వివో X500 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్బుతమైన డిస్ల్పేతో పాటు ప్రీమియం ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo X500 Series: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారం.. అంటే సెప్టెంబర్ 26వ తేదీన మార్కెట్‌లోకి వివో X500 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్‌లో భాగంగా స్టాండర్డ్ మోడల్ వివో X500తో పాటు వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్ మోడళ్లను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. వీటితో పాటు వివో వాచ్ GT 2 స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ గత మోడల్ స్మార్ట్‌ఫోన్స్ కంటే చాలా అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించిన మోడల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ టిప్‌స్టర్ దేబయన్ రాయ్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం ప్రకారం.. వివో X500 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ధర రూ. 1,19,999గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ వివో X500 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,49,999తో అందుబాటులోకి రాబోతోంది.
ఈ వివో X500 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,999తో పాటు 12GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక వివో వాచ్ GT 2 ధర రూ.14,999తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
విడుదల తర్వాత ముందుగా ఈ స్మార్ట్‌ఫోన్స్ వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కలర్ ఆప్షన్ల వివరాల్లోకి వెళితే.. వివో X500 ఎంబర్ రెడ్, టైటానియం బ్లాక్ కలర్స్‌లో.. ఇక ప్రో, ప్రో మాక్స్ మోడళ్లు అపెక్స్ ఆరెంజ్, ఎటర్నల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది..
ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలైన వివరాలను బట్టి చూస్తే.. ఈ సిరీస్ ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. స్టాండర్డ్ వివో X500 ఫోన్ 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరా వివరాల్లోకి వెళితే.. వెనక భాగంలో 50MP ప్రధాన, 50MP అల్ట్రా-వైడ్‌తో పాటు 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని సమాచారం..
వివో X500 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రో మాక్స్‌లో 6.85 అంగుళాల భారీ 2K అమోలెడ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఈ రెండు ప్రో మోడళ్లు అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. వీటిలోనూ 50MP ప్రధాన, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్లతో కూడిన మోస్ట్ పవర్‌ఫుల్ ట్రిపుల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రీమియం ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.