SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8,000mAh బ్యాటరీతో Vivo Y32.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్!

Vivo Y32 Launch: భారీ 8,000mAh బ్యాటరీతో వివో Y32 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది. భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 05:12 PM IST | Updated: Oct 07, 2026, 05:14 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్
Join

Vivo Y32 Launch: ప్రముఖ స్మార్‌ఫోన్‌ తయారీ కంపెనీ VIVO మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఇది ప్రీమియం డిజైన్‌తో లాంచ్‌ అయ్యింది. దీనిని వై-సిరీస్‌లో గ్లోబల్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది వివో Y32 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో వినియోగదారులకు లభించబోతోంది. అయితే, ఇది భారీ 8,000mAh బ్యాటరీతో పాటు ప్రీమియం డిస్ల్పేను కలిగి ఉంటుంది. దీంతో పాటు  120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు వీవో తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలు..
వివో Y32 స్మార్ట్‌ఫోన్ 6.87 అంగుళాల ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లేను కలిగి ఉండబోతోంది.. అలాగే ఇది 1592×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉండడమే కాకుండా.. 120Hz హై-రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుందని కంపనీ తెలిపింది.. అవుట్‌డోర్‌లో ఎండకు కూడా డిస్ల్పే చాలా అద్బుతంగా కనిపించేందుకు 1,300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇందులో యూనిసాక్ T7300 (Unisoc T7300) ప్రాసెసర్‌ను కూడా తీసుకు రాబోతోంది.. మల్టీ టాస్కింగ్ కోసం 4GB, 6GB LPDDR4X ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారంగా వీవో తెలిపింది. అంతేకాకుండా 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా కలిగిఉంటుంది.

భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 8,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం పాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించాలనుకునేవారికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ కూడా లభిస్తోంది. దీని ద్వారా ఇతర ఇతర గ్యాడ్జెట్లను సైతం ఛార్జ్ చేసుకోవచ్చు.

కెమెరా వివరాలు..
ఈ వివో Y32 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా అందించారు. ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్  50MP ప్రధాన సెన్సార్ కెమెరా ఉండబోతోంది. అంతేకాకుండా 2MP సెకండరీ కెమెరా కూడా లభిస్తోంది. వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8MP కెమెరా కూడా అందుబాటులో ఉంది. సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లతో పాటు అన్‌లాకింగ్ కోసం పవర్ బటన్‌పైనే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ సపోర్ట్‌ కూడా లభించడం విశేషం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 (OriginOS 6) ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్విలైట్ రెడ్, సన్‌సెట్ ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను బంగ్లాదేశ్, నేపాల్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అధికారికంగా లాంచ్‌ అయిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తుందనే వివరాలను ఇంక వెల్లడించలేదు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES