• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /రాజన్న సిరిసిల్లలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు..

రాజన్న సిరిసిల్లలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు..

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న తండాల్లో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 06:09 PM IST|Updated: Oct 07, 2026, 06:11 PM IST
joinshare
రాజన్న సిరిసిల్లలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు..
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Politics: ఆ సెగ్మెంటులో పొలిటికల్ డ్రామా.. తాత, మనవరాలి మధ్య అసలైన గేమ్..!

AP Politics: ఆ సెగ్మెంటులో పొలిటికల్ డ్రామా.. తాత, మనవరాలి మధ్య అసలైన గేమ్..!

2

Governor Quota MLC: ముదిరాజ్ కోటాలో ఎమ్మెల్సీ ఎవరికి..? రేసులో ఎవరు ఉన్నారు..

3

Aggipetti Macha Death: సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన కిరణ్ కుమార్!

4

రాజన్న సిరిసిల్లలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు..

5

Candy Crush New Record: క్యాండీ క్రష్ గేమ్‌లో బీహార్ కుర్రాడు వరల్డ్ రికార్డు..22,222 లెవల్‌ చేసుకున్న శుభమ్ కుమార్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajanna Sircilla In Telugu: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి చేటుచేస్తూ.. శాంతిభద్రతలకు ముప్పుగా మారిన అక్రమ నాటుసారా తయారీ ముఠాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల పరిధిలో నాటుసారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు విస్తృత స్థాయిలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఏకకాలంలో పలు తండాలపై మెరుపు దాడులు నిర్వహించిన్నట్ల తెలుస్తోంది.

వీర్నపల్లి మండల పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో కొందరు గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేసి.. విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారట.. పక్కా ప్లానింగ్‌తో మండలంలోని గర్జనపల్లి తండా.. జవహర్‌లాల్ నెహ్రూ తండాతో పాటు భూక్యారెడ్డి తండా, బొంగిరెడ్డి తండాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. అటవీ శివారు ప్రాంతాలు, వాగుల పరిసరాల్లో రహస్య స్థావరాలను అధికారులు జల్లెడ పట్టారు.

ఈ ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు భారీగా నాటుసారా నిల్వలు పట్టుబడ్డట్లు తెలుస్తోంది.. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను అధికారులు గుర్తించి.. అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేసిన్నట్లు అధికారులు వెల్లడించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన పాత్రలతో పాటు సామగ్రిని సీజ్ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో కాచిన నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా అక్రమ దందాను నడిపిస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారిపై ప్రత్యేకమైన కేసులు కూడా బుక్‌ చేశారు.

గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు ఎవరైనా చేపడితే.. వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. నాటుసారా తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని.. ఎవరైనా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలపాలని ప్రజలను కోరినట్లు తెలుస్తోంది.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు సిక్రెట్‌గా ఉంచుతామని హామీ అందించారు.. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Karimnagar