SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఒకే యువతిని ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు.. వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Viral News: ఒకే యువతిని ఇంట్లో ఉండే ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకునే వింత ఆచారం ఎక్కడైనా చూశారా? ఇలాంటి ఆచారం ఇప్పటికీ భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గిరిజన ప్రజలు అనుసరిస్తూ వస్తున్నారు. అయితే, దీని వెనుకున్న అసలు కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 12:15 IST | Updated: Nov 26, 2026, 12:16 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Viral News: ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు ఉంటే.. వారందరికీ వేర్వేరుగా పెళ్లిలు జరుగుతూ ఉంటాయయి. పెళ్లయ్యాక ఎవరి సంసారం వారు విడివిడిగా చేసుకుంటూ ఉంటారు. కానీ.. మన దేశంలోని హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కొన్ని గిరిజన తెగల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుందంటే నమ్ముతారా?. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములందరూ కలిసి ఒకే యువతిని వివాహం చేసుకోవడం అక్కడి ప్రత్యేకమైన ఆచారమట.. ఇలా వారి ఆచారం కొన్ని వందల సంవత్సరాల క్రిందటి నుంచే వస్తోందట.. వినడానికి ఎంతో వింతగా, ఆశ్చర్యంగా అనిపించే ఈ ఆచారం వెనుక బలమైన ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతూ వస్తున్నారు. అయితే, ఒకే యువతి ఇలా ఇద్దరు లేదా ముగ్గురు యువకులు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇలా పెళ్లి చేసుకోవడానికి వారి భాషలో జోడిదారా లేదా  ద్రౌపది ప్రథ అని అంటారట.. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని హట్టి , కిన్నౌరా, జౌన్సారీ వంటి గిరిజన, పర్వత ప్రాంత తెగల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుందట.. ఈ ఆచారం ప్రకారం.. ఒక ఇంట్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు ఉంటే.. వారందరూ కలిసి ఒకే మహిళను వివాహం చేసుకోవాల్సి ఉంటుందట.. పెళ్లి తర్వాత ఆమె ఆ ముగ్గురికీ భార్యగా కొనసాగుతుందని అక్కడ జీవించే స్థానికలు చెబుతున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ ఇంటి పనులు, వ్యవసాయం, పశుపోషణ చేస్తూ జీతం కొనసాగిస్తారట.. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములందరికీ ఒకేసారి ఆ యువతితో వివాహం జరిపిస్తే.. మరికొన్ని చోట్ల పెద్దన్నకు ముందుగా పెళ్లి చేసి.. ఆ తర్వాత తమ్ముళ్లను కూడా ఆ వైవాహిక బంధంలో భాగస్వాములుగా చేస్తారట..

అన్నదమ్ములందరూ ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం వెనుక ప్రధాన కారణం వ్యవసాయ భూమి పంపకాలు ఎవరికి వెళ్లకుండా.. ఒకే భార్య పిల్లలకు లభిస్తాయని, ఇలా వింత ఆచారం కొనసాగిస్తున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. హిమాలయాల్లోని కొండ ప్రాంతాల్లో సాగుకు అనువైన భూమి చాలా తక్కువగా ఉంటుంది.. ఉన్న కొద్దిపాటి భూమి కూడా చిన్నచిన్న కమతాలుగా విడిపోయి ఉంటుంది.. ఒకవేళ ఇంట్లోని ప్రతి సోదరుడు వేర్వేరుగా పెళ్లి చేసుకుని కాపురాలు పెడితే.. ఉన్న ఆ కొద్దిపాటి భూమి మరింత చిన్న ముక్కలుగా చీలిపోతుంది.. ఏ ఒక్క కుటుంబమూ ఆ భూమిపై ఆధారపడి బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా పూర్వీకులు ఈ ఉమ్మడి వివాహ వ్యవస్థను కనిపెట్టారని స్థానికులు చెబుతూ వస్తున్నారు. అందరికీ ఒకే భార్య ఉండటం వల్ల కుటుంబం విడిపోకుండా ఉమ్మడిగా ఉంటుందట.. దీనివల్ల తండ్రి నుంచి వచ్చే ఆస్తి, భూమి ఒకే కుటుంబం చేతిలో భద్రంగా ఉంటాయట. అంతేకాకుండా పొలం పనులకు, పశువుల సంరక్షణకు ఇంట్లో మనుషుల బలం ఎక్కువ అవుతుందని అప్పుడు కుటుంబం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందని వారి అభిప్రాయం..

అయితే, మారుతున్న జీవనశైలితో పాటు ఈ సంప్రదాయంలోనూ మార్పులు వస్తూ ఉన్నాయట.. విద్య, కొత్త ఉపాధి అవకాశాలు, పట్టణీకరణ కారణంగా ప్రస్తుతం యువతలో ఈ తరహా వివాహాల పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందట.. కిన్నౌర్ ప్రాంతంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇలాంటి వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.. అయినప్పటికీ, కొన్ని మారుమూల గ్రామాల్లో తమ పూర్వీకుల ఆచారాన్ని గౌరవిస్తూ ప్రస్తుతాని ఈ పద్ధతిని అనుసరిస్తున్న కుటుంబాలు ఉన్నాయట..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES