SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vadodara Missing Parrot: చిలుక కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్న యువతి.. రూ.1 లక్ష రివార్డు ఇస్తామని ప్రకటన.. వీడియో..

Pet parrot missing in Vadodara: తప్పిపోయిన రామ చిలుక కోసం వడోదరకు చెందిన మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దాన్నితమ బిడ్డలాగా చూసుకున్నామని చెప్పింది. దయచేసి తమ బిడ్డ కన్పిస్తే తెచ్చిపెట్టాలని వెక్కి వెక్కి ఏడ్చింది.

Written By Inamdar Paresh
Published: Nov 05, 2026, 07:45 PM IST | Updated: Nov 05, 2026, 07:53 PM IST
Image Credit: Pet parrot missing in vadodara
Join

Woman Offers rupees 1 Lakh Reward for missing pet parrot  in vadodara: ఇటీవల కొంత మంది తమ ఇళ్లలో శునకాలు, పిల్లుల్ని, రామ చిలుకల్ని పెంచుకుంటున్నారు. మనుషుల కన్నా వాటితోనే ఎక్కువగా అటాచ్ మెంట్ పెంచుకుంటున్నారు.  వాటిని కంటికి రెప్పల్లా కాపాడుకుంటారు.ఒక్క నిముషం కూడా వదిలి పెట్టరు. అంతే కాకుండా ఆ మూగజీవాలు సైతంతమ ఓనర్ లో అదేవిధంగా అటాచ్ మెంట్ ను కల్గి ఉంటాయి. తమ యజమాని చుట్టు తిరుగుతు ఉంటాయి. కొత్త వాళ్లు ఇంటికి వస్తే అప్రమత్తం చేస్తాయి. ఈ క్రమంలో  పొరపాటున మూగ జీవాలు తప్పిపోతే వాటి కోసం యజమానులతో పాటు మూగజీవాలు సైతం తల్లడిల్లిపోతాయి. వాటి కోసం ఎలాంటి త్యాగాలు లేదా రివార్డులు ప్రకటించడానికైన యజమానులు వెనుకాడదు. తాజాగా..వడొదరకు చెందిన ఒక మహిళ తన పెంపుడు రామ చిలుక తప్పిపొవడంతో దాని కోసంఏకంగా ఒక లక్ష రివార్డుగా ప్రకటించింది.

 

 


గుజరాత్ లోని వడొదరకు చెందిన జెస్సీకా అనే యువతి తన ఇంట్లో ఆఫ్రికన్ గ్రే జాతికి చెందిన రామ చిలుకను పెంచుకుంటుంది. దాన్ని గత ఆరునెలల క్రితం తెచ్చుకుని ఇంట్లో తన కన్నబిడ్డలాచూసుకుంటుంది. కనీసం  ఆ  రామచిలుకను ఇంట్లో బొనులో పెట్టకుండా ఫ్రీగా ఉంచేవారు. అది ఇంట్లోని వారు మాట్లాడే మాటలు మాట్లాడేది. కొత్త వారు వస్తే అప్రమత్తం చేసేది. దానికి జెస్సీకా రాఖీకూడా కట్టి తన ప్రేమను చాటుకుంది. దానికి ప్రేమతో లడ్డు అని పేరు పెట్టుకున్నారు. 

రామ చిలుకతోనేఎక్కువగా సమయం గడిపేవారు.  అయితే.. ఇటీవల రామ చిలుక ఇంట్లో నుంచి మెయిన్ డోర్ ఓపెన్ చేసే సరికి అది కాస్త ఎగిరిపోయింది.  దీంతో జెస్సీకా షాక్ కు గురైంది. రామ చిలుక కోసం ఎంత వెతికిన కూడా అది దొరకలేదు. అది ఆఫ్రికన్ గ్రే జాతి రామ చిలుక అని కన్పిస్తే తనకు అప్పగించాలని యువతి వెక్కి వెక్కి ఏడుస్తు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది. 

తనకు రామ చిలుకతో ఎంతో అనుబంధం ఉందని, దాన్ని వదిలి ఉండలేకపోతున్నానని యువతి వాపోయింది. ఫారెస్ట్ అధికారులతో పాటు, తన ఇంటి చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల వరకు వెళ్లి చిలుక కోసం వెతికినట్లు యువతి చెప్పుకొచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు యువతికి మరల ఆమె రామ చిలుక దొరకాలని కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES