SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake Video: ఇదెక్కడి విడ్డూరం.. నిజమైన పాముకు మహిళ స్పెషల్ పూజలు.. వీడియోపై రచ్చ..

Woman rituals to real snake: మహిళ తన ఇంటి ఆవరణలో పాము రావడంతో దానికి ప్రత్యేకంగా పూజలు చేసింది. అంతటితో ఆగకుండా చుట్టుపక్కల వారికి ఈ విషయంను చెప్పింది. ఈ వీడియో పై నెట్టింట రచ్చ నడుస్తొంది. భక్తి ఉండాలి కానీ మరీ ఇంత అతి భక్తి పనికిరాదని జనాలు ఏకీపారేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 14, 2026, 02:53 PM IST | Updated: Nov 14, 2026, 03:04 PM IST
Image Credit: snakevideoviral
Join

Woman performs pooja rituals to real cobra video: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. బ్రాహ్మీమూహుర్తంలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీపరాధన, దానాలు మొదలైనవి ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల నాగుల చవితి పండగను అందరు ఎంతో భక్తితో జరుపుకున్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు వెళ్లి పూజలు నిర్వహించుకున్నారు. కాలసర్పదోష శాంతి పూజలు కూడా చేసుకున్నారు. అయితే నాగుల చవితి రోజున సర్పాలను పూజించడం ఆనవాయితి.  

 

ఈ  క్రమంలో చాలా మంది పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేశారు. అయితే.. ఒక ఇంటి ఆవరణలో పాములు వచ్చింది. దీంతో ఇంటిల్లిపాది కోబ్రాకు భక్తితో పూజలు చేశారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది. నాగుల చవితి నేపథ్యంలో  ఒక మహిళ తన ఇంటి ఆవరణలో వచ్చిన పామును చూసింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి పూజద్రవ్యాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేసింది. ఇంట్లోని కుటుంబ సభ్యులకు, కాలనీ వాసులకు ఈ విషయం చెప్పింది. 

అందరు వచ్చిన కూడా పాము పడగ విప్పి చాలా సేపు అక్కడే ఉండిపోయింది. మహిళ మాత్రం కోబ్రా మీద పసుపు, కుంకుమ, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించింది. అయిన కూడా పాము కదలకుండా మహిళ పూజలు స్వీకరించినట్లు పడగ విప్పి అక్కడే ఉండిపోయింది. కాలనీ వాసులు ఈ ఘటనను చాలా వింతగా చూశారు.  పాము కదలికల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతొ అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES