• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దుబాయ్‌లో కళ్లు చెదిరే బంగారు ముగ్గు.. 380 క్యారెట్ల వజ్రాలతో ప్రత్యేక అలంకరణ!

దుబాయ్‌లో కళ్లు చెదిరే బంగారు ముగ్గు.. 380 క్యారెట్ల వజ్రాలతో ప్రత్యేక అలంకరణ!

Gold Rangoli Video: దీపావళి పండగ సందర్భంగా దుబాయ్‌లోని ఓ జ్యువెలరీ కంపెనీ బంగారు నగలతో ముగ్గును అలంకరించింది. ఇందులో భాగంగా 213 విలువైన బంగారు ఆభరణాలను వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది జరిగి చాలా రోజులవుతున్న ఇప్పుడు వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 02:25 PM IST|Updated: Nov 14, 2026, 02:27 PM IST
joinshare
దుబాయ్‌లో కళ్లు చెదిరే బంగారు ముగ్గు.. 380 క్యారెట్ల వజ్రాలతో ప్రత్యేక అలంకరణ!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Green SM Cabs Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టాక్సీ సర్వీస్.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే! ఓలా, ఉబర్‌కు గట్టి పోటీ?

Green SM Cabs Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టాక్సీ సర్వీస్.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే! ఓలా, ఉబర్‌కు గట్టి పోటీ?

2

Snake Video: ఇదెక్కడి విడ్డూరం.. నిజమైన పాముకు మహిళ స్పెషల్ పూజలు.. వీడియోపై రచ్చ..

3

దుబాయ్‌లో కళ్లు చెదిరే బంగారు ముగ్గు.. 380 క్యారెట్ల వజ్రాలతో ప్రత్యేక అలంకరణ!

4

సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

5

KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Rangoli Video: సాధారణంగా దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు తప్పకుండా రంగురంగుల ముగ్గులతో పాటు పూలను అలంకరిస్తూ ఉంటారు.. మట్టి ప్రమిదలు వెలుగిస్తూ బాణాసంచా కాలుస్తూ ఉంటారు.. అయితే.. విలాసాలకు, వింతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్‌లో ఈసారి దీపావళి వేడుకలను అత్యంత అద్భుతంగా.. కళ్లు చెదిరే రీతిలో నిర్వహించారు. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటున్న సమయంలో ఏకంగా 6.5 కిలోల బంగారు ఆభరణాలతో పాటు వందలాది క్యారెట్ల వజ్రాలతో ఓ భారీ ముగ్గును వేశారు.. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దుబాయ్‌లోని సిటీ సెంటర్ దేరా మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఆభరణాల సంస్థ డమాస్ జ్యువెలరీ, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ముగ్గులు పెట్టారు.. ఈ ప్రత్యేక ముగ్గుకు 213 విలువైన బంగారు ఆభరణాలను వినియోగించినట్లు తెలస్తోంది.. వీటిలో బరువైన నెక్లెస్‌లతో పాటు గాజులు, చెవి జూకాలు, ఉంగరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడుగా 380 క్యారెట్లకు పైగా అసలైన వజ్రాలతో కూడిన ఇతర ఆభరణాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

దాదాపు 2 మీటర్ల విస్తీర్ణంలో ఈ బంగారు ముగ్గును ఎంతో కష్టపడి వేశారట.. పది మంది హస్తకళాకారులు 16 గంటల పాటు కష్టపడి.. ప్రతి ఆభరణాన్ని ఒక పేర్చుతూ ఈ అద్భుతమైన ముగ్గును వేశారట.. ఈ ముగ్గుల డిజైన్‌ను ఏమాత్రం చెడకుండా ఉండేందుకు.. ప్రత్యేకంగా కొన్ని ఆభరణాలు తయారు చేశారని సమాచారం..

ప్రస్తుతం ఈ బంగారు ముగ్గుకు సంబంధించిన వీడియో దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఈవెంట్స్ అధికారిక సోషల్ మీడియా పేజీ నుంచి పోస్ట్ చేశారు.. అందరూ చూస్తుండగా ఇంత భారీ మొత్తంలో బంగారం, వజ్రాలను నేలపై పేర్చడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ఇలాంటి సాహసం కేవలం దుబాయ్‌లో మాత్రమే సాధ్యం.. అంటూ కొంతమంది సోసల్‌ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. అంతేకాకుండా ఈ ముగ్గును చేసేందుకు భారీ ఎత్తున జనాలు కూడా తరిలి వచ్చారు.

— Nuqta e Nazar - نقطۂ نظر (@fizimughal) November 7, 2026

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News