SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మహర్నవమి వేళ కన్యాపూజ చేసిన యోగి ఆదిత్యనాథ్.. చిన్నారుల పాదాలు కడిగి ఆశీర్వాదం!

Yogi Adityanath Kanya Pujan: ఉత్తరప్రదేశ్‌లో కన్యా పూజకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గోరఖ్నాథ్ ఆలయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాతృశక్తులుగా భావించే చిన్నారి బాలికలకు కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఊహించిన స్థాయిలో వైరల్ అవుతున్నాయి..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 03:21 PM IST | Updated: Oct 19, 2026, 03:22 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Yogi Adityanath Kanya Pujan: శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజుగా భావించే మహర్నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ కన్యా పూజ నిర్వహించారు. గోరక్షక పీఠాధిశ్వరుడి హోదాలో ఆయన స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని.. మాతృ శక్తికి ప్రతీకలైన చిన్నారి బాలికలను సాక్షాత్తు దుర్గా స్వరూపాలుగా భావించి ప్రత్యేకమైన పూజలు చేశారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలికలను ఆసీనులను చేసిన ముఖ్యమంత్రి.. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఇత్తడి పల్లెలో వారి పాదాలను స్వయంగా నీటితో కడిగి తుడిచారు.. అంతరం వారి నుదుటిన చందనంతో పాటు కుంకుమ తిలకం దిద్ది.. చేతులకు రక్షా సూత్రాలు కట్టారు.. పూలమాలలు వేసి.. ప్రత్యేకమైన హారతులు ఇచ్చి చిన్నారుల పాదాలకు నమస్కరిస్తూ వారి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఒక సన్యాసిగా.. భక్తుడిగా ఆయన ప్రదర్శించిన తీరు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది..

పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత చిన్నారులందరికీ సీఎం స్వయంగా భోజనం వడ్డించారు.. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ప్రేమతో అందించారు. భోజనం చేసిన తర్వాత బాలికలకు నూతన వస్త్రాలతో పాటు పండ్లు, మిఠాయి, దక్షిణను అందజేసి వారిని సత్కరించారు.. చిన్నారుల చిరునవ్వుతో ఆలయ ప్రాంగణమంతా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ వెలు విరిసింది..

ఈ వేడుక అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో శ్రీ ఆదిశక్తిగా.. సృష్టికి మూలకారకంగా ఆరాధిస్తామని.. నవరాత్రుల వేల బాలికలను పూజించడం మన సాంస్కృతిలో ఒక పద్ధతిని ఆయన పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఆ జగన్మాత దుర్గాదేవి కరుణాకటాక్షాలు ఉండాలని.. ప్రతి ఇంట సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు, సంపూర్ణ శాంతి వర్ధిల్లాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు ముందుగానే ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం..

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES