SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Zee Media Nasha Mukt Bharat: దేశవ్యాప్తంగా డ్రగ్స్‌పై జీ మీడియా పోరాటం.. ‘నషా ముక్త్ భారత్’ ప్రచారం ప్రారంభం

Drug Free India Campaign: డ్రగ్స్ మహమ్మారిపై పోరాటానికి జీ మీడియా నడుం బిగించింది. బాధితుల అనుభవాలు, కుటుంబాల ఆవేదన, వ్యసనాన్ని జయించిన వారి విజయగాథలను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ‘నషా ముక్త్ భారత్’ పేరుతో దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 18, 2026, 15:47 IST | Updated: Nov 18, 2026, 15:49 IST
Image Credit: Zee Media Nasha Mukt Bharat
Join

Drug Free India Campaign: దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ఎదురవుతున్న సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జీ మీడియా ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) ప్రచారాన్ని ప్రారంభించింది. నవంబర్ 16న జీ న్యూస్‌ మెయిన్ ప్రోగ్రామ్ ‘DNA’లో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. రాహుల్ సిన్హా ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. రాబోయే వారాల్లో ఈ ప్రచారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు, పరిశోధనాత్మక స్టోరీలు, గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు, అవగాహన కథనాలను ప్రసారం చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి అనుభవాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. టీవీ‌తో పాటు డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

ఈ కార్యక్రమంపై జీ మీడియా సీఈఓ రక్తిమ్ దాస్ మాట్లాడుతూ.. సమాజంలో చర్చలను ప్రభావితం చేయడంతో పాటు ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురాగల పవర్ మీడియాకు ఉందన్నారు. టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను సమన్వయం చేస్తూ.. డ్రగ్స్ రహిత భారత్ సందేశాన్ని దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరవేయడమే తమ ప్రయత్నమని తెలిపారు. మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కోవడానికి నిరంతర అవగాహన, సామాజిక బాధ్యత, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంతో పాటు దేశ యువత ఆశయాలు, భవిష్యత్తును కాపాడుకోవాలంటే డ్రగ్స్ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

జీ న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం అనేది కేవలం ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. దేశ యువత సామర్థ్యాన్ని దెబ్బతీసే తీవ్రమైన సామాజిక సవాలన్నారు. ఈ ప్రచారం ద్వారా పరిశోధనాత్మక జర్నలిజంతో పాటు బాధితుల నిజ జీవిత అనుభవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. డ్రగ్స్ వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు.. ఈ సమస్యపై పోరాడుతున్న వారి గొంతుకను సమాజానికి వినిపిస్తామన్నారు. ఈ ప్రచారంలో కేవలం డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి చెప్పడానికే పరిమితం కాకుండా, వ్యసనాన్ని జయించి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన వారి అనుభవాలకు కూడా చోటు కల్పించనున్నారు. మాదకద్రవ్యాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాల కథనాలతో పాటు బాధితులకు అండగా నిలుస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా ప్రజలకు పరిచయం చేయనున్నారు.

ఈ జాతీయ స్థాయి ప్రచారాన్ని జీ మీడియా తన విస్తృతమైన మీడియా నెట్‌వర్క్ ద్వారా నిర్వహించనుంది. ఇందులో 16 టీవీ ఛానళ్లు, 32 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు భాగస్వామ్యం కానున్నాయి. డ్రగ్స్ సమస్యపై దేశవ్యాప్తంగా చర్చను ప్రోత్సహించడం, ప్రజల్లో బాధ్యతను పెంచడం, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి పౌరులను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES