Hyundai Exter Down Payment: ఎప్పటి నుంచో హ్యుందాయ్ ఎక్స్‌టర్ HX2 కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అంతేకుండా కొంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చేసి.. EMI కట్టాలనుకునేవారికి ఇదే అద్భుతమైన బడ్జెట్ ఫ్లానింగ్‌గా చెప్పుకోవచ్చు. అయితే, ఈ ఫైనాన్షియల్ ఫ్లానింగ్ ప్రకారం.. ఎంత మొత్తంలో ప్రతి నెల EMI కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Exter Down Payment: ఎప్పటి నుంచో హ్యుందాయ్ ఎక్స్‌టర్ HX2 కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అంతేకుండా కొంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చేసి.. EMI కట్టాలనుకునేవారికి ఇదే అద్భుతమైన బడ్జెట్ ఫ్లానింగ్‌గా చెప్పుకోవచ్చు. అయితే, ఈ ఫైనాన్షియల్ ఫ్లానింగ్ ప్రకారం.. ఎంత మొత్తంలో ప్రతి నెల EMI కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5
ప్రతి నెల EMI
ఇక ఈ కారుకు ప్రతి నెల EMI కడితే.. మొత్తం రూ. 2,87,376 అవుతుంది. అంటే రూ. 2.39 లక్షల లోన్ మొత్తానికి 4 ఏళ్లలో చెల్లించే అదనపు వడ్డీ కేవలం రూ. 48,170 మాత్రమే అవుతుంది. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్‌గా భావించవచ్చు..
2/5
డౌన్‌పేమెంట్
దీనిపై డౌన్‌పేమెంట్ (Down Payment) రూ.4,60,000 ముందస్తుగా చెల్లిస్తే.. మొత్తం లోన్ అమౌంట్ రూ.2,39,206 అవుతుంది. దీనిని బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా లోన్ పొందవచ్చు.. ఇక సంవత్సరానికి 9.30 శాతం వడ్డీ రేటు అయినా.. ఈ EMIని తిరిగి చెల్లించడానికి 4 సంవత్సరాల పాటు టైమ్ ఎంచుకున్న ప్రతి నెల ఈఎంఐ (EMI) రూ. 5,987 చెల్లించాల్సి ఉంటుంది..
3/5
ఎక్స్‌షోరూమ్ ధర
ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిసి ఉంటాయని కొన్ని డీలర్ షిప్‌లు తెలుపుతున్నాయి. ఇక ఈ కారుకు సంబంధించిన బడ్జెట్ ఫ్లానింగ్ వివరాల్లోకి వెళితే.. డౌన్‌పేమెంట్‌గా ఈ కారును కొనుగోలు చేసే క్రమంలో రూ.4,60,000 చెల్లిస్తే.. EMI చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది..
4/5
హ్యుందాయ్ ఎక్స్‌టర్ HX2
హ్యుందాయ్ ఎక్స్‌టర్ HX2 (Petrol) వేరియంట్ కారు మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోతోంది.. ఇది ప్రస్తుతం 4.7 స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ దీనిపై ప్రత్యేక దీపావళి ఆఫర్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు రూ.6,99,206తో లభిస్తోంది.
5/5
ఎంట్రీ లెవల్ మైక్రో ఎస్‌యూవీ
ఎంట్రీ లెవల్ మైక్రో ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ది బెస్ట్‌గా భావించవచ్చు. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం డిజైన్‌లో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా ఈ కారు ధర రూ.5.81 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ముఖ్యంగా దీనిని EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయాలనుకునేవారికి కొన్ని రకాల ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.