Itel City 300 5g: భారత మార్కెట్లోకి ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ధర రూ.14,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది యువత దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Itel City 300 5g: మీరు కూడా ఎప్పటి నుంచో అత్యంత చీప్ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మార్కెట్లోకి బుధవారం విడుదలైన ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.. మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ఫోన్ 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1/5
ఆపరేటింగ్ సిస్టమ్
స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. ఇది అల్ట్రాలింక్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ ఆక్టా-కోర్ UNISOC T8200 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది.
2/5
పిక్సెల్స్ రిజల్యూషన్
ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్‌లో 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.67-అంగుళాల HD+ LCD పంచ్-హోల్ డిస్ప్లేను కూడా కలిగి ఉండడం విశేషం.. ఇందులో కంపెనీ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
3/5
ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్
ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది 4GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తోంది. దీని ధర రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డార్క్ రూబీ, మిస్ట్ బీజ్‌తో పాటు బోల్డ్ ఇండిగో కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రావడం విశేషం..
4/5
5000mAh బ్యాటరీ
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువ సేపు వినియోగించినప్పటికీ ఏ మాత్రం బ్యాటరీ తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఆప్షన్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఎన్నో రకాల ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
5/5
అద్భుతమైన డిజైన్
ఈ ఐటెల్ సిటీ 300 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన డిజైన్‌లో ప్రీమియం కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రావడం వల్ల యువతను ఎంతగానో ఆకర్శిస్తోంది. అంతేకాకుండా ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యుల్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల ఈ స్మార్ట్‌ఫోన్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది.