SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chanakya Niti: హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌కి ఆచార్య చాణక్యుడి గోల్డెన్ రూల్స్ ఇవే!

Acharya Chanaky Niti: ఆచార్య చాణక్యుడు విషయానికొస్తే.. సామాన్య శకం పూర్వమే ఆయన చెప్పిన నీతి సూత్రాలు అప్పటికీ ఇప్పటికీ సదా ఆచరణీయమే. ఈయన ఆర్ధిక విషయాలతో పాటు వివాహాది పలు అంశాల్లో ఆయన చెప్పిన నీతి సూత్రాలు ఆచరించదగినవే. ముఖ్యంగా జీవిత భాగస్వామిని తొందరపాటుతో లేదా కేవలం భావోద్వేగాల ఆధారంగా ఎంచుకోవడం కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇందుకోసం, ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎందరో వివాహితులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 08, 2026, 06:33 AM IST | Updated: Nov 08, 2026, 06:34 AM IST
Image Credit: Acharya Chanakya (AI/ Pic Source)
Join

చాణక్య నీతి: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహాం అనేది  ఒక ముఖ్యమైన ఘట్టంగా అని చెప్పాలి.  ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. కానీ ఎన్నో ఒడిదుడుకులతో వివాహామైనా కొన్నిసార్లు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం మాత్రమే కాదు, అది నమ్మకం, గౌరవం, పరస్పర అవగాహనకు కూడా సంబంధించినది. రెండు కుటుంబాలకు చెందినది. అందుకే జీవిత భాగస్వామిని తొందరపాటుతో లేదా కేవలం భావోద్వేగాల ఆధారంగా ఎంచుకోవడం కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇందుకోసం, ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎందరో వివాహితులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వారి రూపం, డబ్బు లేదా కనబడే తీరును బట్టి కాకుండా, వారి ప్రవర్తన, ఆలోచనలు,  భావాలను బట్టి అర్ధం చేసుకోవాలని చెబుతుంది. కానీ వివాహానికి ముందు ఈ అంశాలను విస్మరించడం వైవాహిక జీవితంలో అనేక విభేదాలకు దారితీయవచ్చు.

బాహ్య సౌందర్యాన్ని చూసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.  అందమైన ముఖం కంటే మంచి స్వభావం ముఖ్యం. ఆచార్య చాణక్యుని ప్రకారం, అందమైన ముఖాన్ని చూసి వివాహాన్ని చేసుకోవడం మంచి నిర్ణయం కాదంటారు.

కోపంతో, కఠినంగా మాట్లాడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.  చిన్న విషయాలపై కోపం సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అలాంటి వ్యక్తులు సాధారణంగా చిన్న విషయాలను పెద్ద వాదనలుగా మారుస్తారు. అందువల్ల, సహనం ఉన్న వ్యక్తితో కలిసి జీవించడం సులభం అని చాణక్యుడు చెప్పాడు.

దురాశపరుడికి దూరంగా ఉండటం మంచిది: ప్రేమ కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వైవాహిక జీవితంలో పలు సమస్యలకు కారణమవుతుంది. వివాహ బంధం అనేది నమ్మకంతో పాటు పరస్పర అవగాహన పై  ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కేవలం డబ్బు, ఆస్తి లేదా ఆర్థిక స్థితిని చూసి బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, కష్ట సమయాల్లో కలిసి ఉండే అవకాశాలు తగ్గిపోవచ్చు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

గౌరవం ముఖ్యం: ప్రవర్తనే ఒక వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు. అందువల్ల, ఒక వ్యక్తి ఇతరులను అగౌరవపరిస్తే, వివాహాం తర్వాత వారు తమ భాగస్వామిని, కుటుంబాన్ని గౌరవిస్తారని ఆశించడం కష్టం. అందువల్ల, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యుడు చెప్పాడు.

Disclaimer (గమనిక): ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా చాణక్య నీతిలోని అంశాల ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని మరింత సమాచారం కోసం దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకొండి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES