SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dev Uthani Ekadashi: దేవుత్తని ఏకాదశి ఎప్పుడు..?.. కార్తీక మాసంలో దీని విశిష్టత ఏమిటంటే..?..

Karthika masam: కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశి లేదా దేవుత్తని ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో నుంచి బైటకు వస్తారని నమ్ముతారు. విష్ణు ఆలయాలను ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

Written By Inamdar Paresh
Published: Nov 16, 2026, 20:12 IST | Updated: Nov 16, 2026, 20:26 IST
Image Credit: dev uthani ekadashi (file)
Join

Dev uthani Ekadashi 2026 date puja vidhi tradition: కార్తీక మాసం అనేది దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసంగా పండితులు చెబుతుంటారు.ఈ మాసంలో దీపారాధన, బ్రాహ్మీమూహుర్తంలో కార్తీక స్నానాలు,  సాలగ్రామ దానం, వనభోజనాలు మొదలైనవి చేయాలని పండితులు చెబుతుంటారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు వెయ్యిరెట్లు గొప్పఫలితాల్ని ఇస్తాయి. ఈ క్రమంలో మనం కార్తీక మాసంలో నవంబరు 21న శనివారం రోజున ప్రభోదిని ఏకాదశి లేదా దేవుత్తని ఏకాదశిని మనం జరుపుకుంటాం. చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఆషాడ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి బైటకువస్తారని నమ్ముతారు. అందుకే ఈ రోజున దేవుత్తని ఏకాదశి అని పిలుస్తారు. 

 హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి 2026 నవంబర్ 21వ తేదీ శనివారం రోజున ఉదయం 3:15 గంటలకు ప్రారంభమై, నవంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 6:41 గంటలకు ముగుస్తుంది. ఈ రోజంతా అత్యంత శుభప్రదయోగమని పండితులు చెబుతున్నారు.

ఈ నాలుగు నెలల పాటు ఆగిపోయిన పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, మొదలైన శుభకార్యాలను మరల ప్రభోదిని ఏకాదశి నుంచి మరల మొదలు పెడతారు. ద్వాదశి రోజున తులసీ వివాహంను తప్పకుండా నిర్వహిస్తారు. తులసీ వివాహం జరిపించడం వల్ల వివాహల్లో వస్తున్న ఆటంకాలు దూరమౌతాయి.  శనివారం రోజున ప్రభోదిని ఏకాదశి రావడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.  

ప్రభోదిని ఏకాదశి రోజున విష్ణు భగవానుడి ఆరాధన, షోడషోపచారలతో పూజలు చేయాలి. సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనేక గొప్ప శుభఫలితాలు ప్రాప్తిస్తాయి. ఉసిరి చెట్టు కింద దీపారాధన నెయ్యితో లేదా నువ్వుల నూనెతో పెట్టాలి., వనభోజనం వంటివి చేయాలి. తులసీ దళాలతో శ్రీ మహా విష్ణువును ప్రత్యేకంగా పూజించుకొవాలి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే విశేషమైన ఫలితాలు కల్గుతాయని, అనేక రకాల దోషాలు దూరమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ( గమనిక -  ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం,విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES