• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /దశాబ్దాల చీకట్లకు చెక్.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి కరెంట్ వెలుగులు.. ఈ దీపావళి నిజంగా స్పెషల్!

దశాబ్దాల చీకట్లకు చెక్.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి కరెంట్ వెలుగులు.. ఈ దీపావళి నిజంగా స్పెషల్!

Diwali Miracle: దీపావళి సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పల్లెల్లోకి కరెంట్‌ వచ్చింది. చీకటి నుంచి వెలుగు లభించడంతో అక్కడి ప్రజలు అసలైన దీపావళి పండగను జరుపుకుంటున్నారు. అయితే, ఏయే ప్రాంతాల్లో మొట్టమొదటి సారిగా కరెంట్‌ వచ్చిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 10:58 AM IST|Updated: Nov 07, 2026, 10:59 AM IST
joinshare
దశాబ్దాల చీకట్లకు చెక్.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి కరెంట్ వెలుగులు.. ఈ దీపావళి నిజంగా స్పెషల్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Pulivendula ZPTC: వైఎస్ జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల జెట్పీటీసీ టీడీపీ కైవసం..

Pulivendula ZPTC: వైఎస్ జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల జెట్పీటీసీ టీడీపీ కైవసం..

2

అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలతో.. సమ్మర్ హాలిడేస్‌తో బాక్సాఫీస్ సందడి..

3

చైనా LED లైట్ల దెబ్బకు కుమ్మరుల బతుకులు ఆగమాగం.. దీపావళి వేళా ఆకలి కేకలు!

4

కార్తీక మాసంలో ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు..

5

CP Sajjanar: దీపావళి కానుకల పేరిట మెస్సెజ్‌లు.. పండగ వేళ సీపీ సజ్జనార్ కీలక సూచనలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Miracle News: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి.. దశాబ్దాలు అవుతున్నప్పటికీ.. ఆధునిక ప్రపంచం సాంకేతిక విప్లవంతో ముందుకు దూసుకుపోతున్నా... ఇప్పటికీ చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్న మారుమూల గిరిజన పల్లెలకు ఎట్టకేలకు అద్భుతమైన శుభవార్త అందింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని మారుమూల గ్రామాలు విద్యుత్ వెలుగులతో దీపావళి జరుపుకుంటున్నాయి.. దశాబ్దాల తరబడి కొనసాగిన చీకటి బతుకులకు ఇక వెలుగు లభించబోతోంది.. విద్యుత్ తీగలు ఆ గ్రామాలను తాకడంతో.. ఈ ఏడాది పండుగ ఆ గిరిజనుల జీవితాల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతూ వస్తోంది. అయితే, ఈ పండగ సందర్భంగా వెలుగులు పొందిన గ్రామాలేవో? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా... చక్రా గ్రామానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యుత్ సౌకర్యం లభించడం విశేషం.. ఇప్పటివరకు కిరోసిన్ దీపాలతో పాటు వెలిగి వెలగని.. కొవ్వొత్తుల వెలుగుల్లోనే రాత్రులను గడిపిన 400 ఆదివాసీ కుటుంబాల ఇళ్లలో మొదటిసారిగా బల్బులు వెలిగాయి.. చీకట్లను వీడి ఇళ్లన్నీ విద్యుత్ వెలుగులతో నిండటంతో అక్కడి వారు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. విద్యుత్ సరఫరా మొదలు కావడంతో చిన్నారుల చదువులకు తీవ్ర ఇబ్బందులు తొలగిపోయాయని అక్కడి గ్రామస్తులు చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది దీపావళి తమకు సరికొత్త ఆశలతో పాటు డబుల్ హ్యాపీనెస్‌ను అందించిందని వారు హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మన్యంలో కూడా కొన్ని గూడేల్లో దీపావళి వెలుగులు నిండాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గూడెంలో నవంబర్ 4న మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా మొదలైందట.. కొండ కోనల మధ్య బయటి ప్రపంచానికి దూరంగా.. కటిక చీకట్లో జీవిస్తున్న గిరిజనులకు విద్యుత్‌ అంటే ఏమిటో తెలిసి వచ్చింది. కరెంట్‌ రాకతో గ్రామస్తులు ఆనందంగా ఉన్నారు. రాత్రి సమయాల్లో విషపురుగులతో పాటు వన్యప్రాణుల భయం నుంచి రక్షణ లభించడంతో పాటు.. మౌలిక వసతులకు ఈ అద్భుతమైన పరిణామం తొలి ముందడుగు అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..

అయితే, మారుమూల అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం రావడం కేవలం బల్బులు వెలగడానికే పరిమితం కాదు.. ఇది గ్రామీణ విద్యాభివృద్ధికి.. మొబైల్ కనెక్టివిటీకి, ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు బాటలు వేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.. తరతరాలుగా ఎదురుచూసిన ఆ గిరిజనుల నిరీక్షణ ఫలించి.. పండుగ వేళ వారి ఇళ్లల్లో వెలుగులు నిండటం నిజమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News