CP Sajjanar on fake Paytm Diwali gift messages: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి సంబరాల్ని జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి వేళి రోజున చాలా మందితమ ఇళ్లంతా దీపాలు వెలిగిస్తారు. చిన్న, పెద్దా తేడా లేకుండా టపాకాయాల్ని కాలుస్తారు. అయితే పండగలు రాగానే సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో మోసాలకు తెరతీశారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ దీపావళి పేటిఎం మెస్సెజ్ లపై, ఆన్ లైన్ ఫెక్ ప్రచారాలపై కీలక ప్రకటన చేశారు. పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తుంది.. దీన్ని వెంటనే క్లెయిమ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం పచ్చి మోసమంటూ సీపీ సజ్జనార్ ట్విట్ చేశారు. అయితే.. దీన్ని మరికొంతమంది కూడా ప్రచారాలు చేస్తున్నారు.
ఇలాంటి ఫెక్ ప్రచారాలను నమ్మకూడదని సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇది కేవలం సైబర్ కేటుగాళ్లు పన్నిన వల అని చెప్పుకొచ్చారు. పండగ పూట ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను (`http://akcxy.buzz)` వంటి నకిలీ వెబ్‌సైట్లు) పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని అలర్ట్ జారీచేశారు. ఈ లింకుల వల్ల మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు.
అంతే కాకుండా.. ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల వల్ల ఉచితంగా నగదు పంపిణీ చేయదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. అంతే కాకుండా.. గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయవద్దన్నారు. నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి ఇతర వాట్సాప్ గ్రూపులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి ఇతరులనూ ముప్పులోకి నెట్టవద్దన్నారు.
ఎలాంటి సందర్భంలోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైన మోసపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయడం లేదా https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.