SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దారిద్య్రం తొలగి లక్ష్మీకటాక్షం కలగాలంటే.. గోవుకు మొదటి రోటీ ఇలా తినిపించండి!

Roti To Cow News: చాలామంది దారిద్రంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఎంత కష్టపడినప్పటికీ ఫలితాలు పొందలేక వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు గోమాతకు ఇంట్లో తయారుచేసిన మొదటి రోటీతో పాటు బెల్లం నెయ్యిని కలిపి సమర్పిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారని పండితులు నాగరాజ్ శర్మ చెబుతున్నారు.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 12:03 PM IST | Updated: Oct 11, 2026, 12:04 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Roti To Cow News: హిందూ సనాతన సాంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని ప్రముఖ పండితులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదని.. సర్వదేవత స్వరూపమని.. సాక్షాత్తు కామదేనువు ప్రతిరూపమని మన పురాణాల్లో ఎంతో క్లుప్తంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. తరాలుగా భారతీయ గృహాల్లో ప్రతిరోజు వంట చేసుకునేటప్పుడు.. తాజా పిండితో తయారుచేసిన మొట్టమొదటి రోటీని లేదా ఆహారాన్ని గోమాతకు సమర్పించే ఆచారం కూడా ఉంది. ఈ పద్ధతి కేవలం ఆచారం మాత్రమే కాదని దీని వెనక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాముఖ్యత ఉందని పండితులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

హిందూ విశ్వాసాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్ముతూ ఉంటారు.  శ్రీమహావిష్ణువు తో పాటు బ్రహ్మ పరమేశ్వరుడితో పాటు లక్ష్మీదేవి ఆవులు నివసిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇంట్లో పండిన తొలి ఆహారాన్ని గోమాతకు సమర్పించడం వల్ల సమస్త దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట సిరి సంపదలతో పాటు దాన్య సమృద్ధిని అందిస్తుందని హిందువులంతా నమ్ముతూ ఉంటారు.

గ్రహదోష నివారణ..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా గోగ్రాసానికి విశేష ఫలితం ఉంటుందట.. నిత్యం గోవులకు ఆహారాన్ని అందించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలతో పాటు గురుడు శుక్రుడు రాహు కేతు వంటి ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని పండితులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే ఇంట్లో వండిన మొదటి ఆహారాన్ని ఆవుకు ఇవ్వడం వల్ల ఆ ఇంట ఉండే ప్రతికూల శక్తులతో పాటు వాస్తు దోషాలు కూడా తొలగిపోయి.. సానుకూల శక్తులు విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

సనాతన ధర్మంలో గృహవాస్తు ఆచరించాల్సిన పంచ మహా యజ్ఞులలో.. భూతయజ్ఞం ఒకటి.. అంటే మన చుట్టూ ఉన్న మూగజీవులతో పాటు ప్రాణులకు ఆహారం పెట్టి ఆకలి తీర్చడం అన్నమాట.. ఇంట్లో తినే ముందు ఒక భాగాన్ని గోవుకు ఆహారంగా సమర్పించడం వల్ల మనుషులలో కృతజ్ఞత భావం.. దయాగుణం, ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతాయని.. రోటీల్లో కొద్దిగా బెల్లం తో పాటు నెయ్యి కలిపి గోమాతకు తినిపించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి.. ముఖ్యంగా ఎప్పటినుంచో దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు ఆవుకు మొదటి రోటీని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు తొందరలోనే చూస్తారని పండితులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు.

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES