అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్పాట్, ఉద్యోగంలో పురోగతి!
Guru Ketu Conjunction 2026: గురు-కేతువుల కలయిక కారణంగా అక్టోబర్ 31వ తేది నుంచి బంపర్ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనుకోని ధన లాభాలు కూడా కలుగుతాయి.
Guru Ketu Conjunction 2026: అక్టోబర్ 31వ తేది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే రోజు గురు గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, కేతువు గ్రహం కూడా అక్కడే సంచార దశలో కొనసాగుతోంది. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదే సమయంలో కొన్ని రాశులవారి జీవితాల్లో వృత్తి, వ్యాపారం పరంగా మార్పులు కూడా సంభవిస్తాయి. గురు-కేతువుల కలయిక కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. దీంతో పాటు దీపావళి సమయంలో బోలెడు లాభాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
దీపావళి సమయంలో గురు-కేతువుల కలయిక కారణంగా మేష రాశివారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఉద్యోగాల పరంగా బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిస్యులు తెలుపుతున్నారు. ము్ఖ్యంగా ఆప్పులు చేసిన డబ్బులు కూడా తిరిగి చెల్లిస్తారు. కొత్త ఆస్తుల పరంగా కూడా బంపర్ లాభాలు కలిగే ఛాన్స్లు ఉన్నాయి..
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఊహించని ప్రయోజానాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో శాంతితో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతాయి.
కన్యా రాశి
గురు-కేతువుల ఎఫెక్ట్తో కన్యా రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అనేక రంగాలలో మెరుగుదల కనిపిస్తుందని ఆయన తెలిపారు. నిలిచిపోయిన ప్రజెక్ట్లు కూడా తిరిగి పొందుతారు. అలాగే వ్యాపారాల పరంగా కూడా అభివృద్ధి లభిస్తుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పిల్లల నుంచి అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు.
సింహ రాశి
గురు-కేతువుల కారణంగా సింహ రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. పార్ట్-టైమ్ పనులు చేసేవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. అలాగే ఆస్తుల పరంగా వస్తున్న వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
గమనిక..