Iqoo 16 Price: విడుదలైన iQOO 16లో హైలెట్ ఫీచర్స్ ఇవే.. ధర ఎంతంటే?
Iqoo 16 Price: చైనాలో మార్కెట్‌లోకి iQOO 16 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ మొత్తం నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 8400mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Iqoo 16 Price: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ iQOO 16 అధికారికంగా లాంచ్ అయ్యింది. దీనిని ఐకూ కంపెనీ చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 8400mAh భారీ బ్యాటరీ కూడా కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్పెషల్ ఫీచర్స్ వివరాలు..
ఈ iQOO 16 ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన 6.85-అంగుళాల 2K+ శాంసంగ్ M16 LTPO AMOLED స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో డాల్బీ విజన్‌తో పాటు DC డిమ్మింగ్ స్క్రీన్‌ను కూడా మెరుగుపరిచిన్నట్లు తెలుస్తోంది..
లేటెస్ట్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 (2nm) చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 850 GPUతో ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7తో ఇది రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో అద్బుతమైన మూడు 50MP సెన్సార్లతో కూడిన కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యుల్ కూడా లభిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇందులో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా కలిగి ఉండడం విశేషం.. అలాగే ఫ్రంట్ భాగంలో 32 మెగాపిక్సెల్ హై-క్వాలిటీ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ 8400mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాకుండా 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. ధరల వివరాల్లోకి వెళితే.. ఇందులో 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ 5,999 యువాన్లతో అందుబాటులో ఉంది. ఇక ఇది భారత కరెన్సీలో సుమారు రూ.85,800 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.