Karthikamasam: కార్తీక మాసంలో 365 వత్తుల గుత్తి దీపం వెలిగిస్తున్నారా..?.. ఈ రహస్యమైన విషయాలు మీకు తెలుసా..?
Karthika pournima: కార్తీక మాసంలో చాలా మంది 365 వత్తుల గుత్తి దీపం వెలిగిస్తారు. ఈ క్రమంలో అనాదీగా ఈ దీపం వెలిగించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Karthika masam 365 wicks deepam tradition: తెలుగు మాసాలన్నింటిలో కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో మనం చేసే పూజలు, వ్రతాలు గొప్ప శుభయోగాలతో పాటు జీవితంలో గొప్ప మార్పుల్ని తీసుకొని వస్తాయి. ఈ మాసంలో ఆషాడ ఏడాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుభగవానుడు కార్తీక మాసంలో ప్రభోదిని లేదా దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రతం కూడా ముగుస్తుంది.
అందుకే ఈ ఏకాదశిని అత్యంత శక్తివంతమైందని చెబుతుంటారు. ముఖ్యంగా నవంబర్ 20 కార్తీక మాసం దశమి, 21న ఏకాదశి, 22 తులసీ ద్వాదశి, 24న కార్తీక పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ఈ క్రమంలో కార్తీక మాసంలో చాలా మంది 365 వత్తీదీపం వెలిగిస్తారు. అయితే.. 365 గుత్తి దీపం వెలిగించే క్రమంలో కొన్నినియమాల్ని పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కార్తీకంలో మనం చేసే పూజలు, వ్రతలు, దానాలు గొప్ప ఫలితాల్ని ఇస్తాయి. అందుకే దీపారాధన, దానాలు ఈ మాసంలో ఎక్కువగా చేస్తారు.
365 వత్తుల గుత్తిదీపం ఎలావెలిగించాలంటే..?...
కార్తీక మాసంలో గుత్తిదీపంకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 365 వత్తులను తొలుత నువ్వుల నూనె లేదా ఆముదపు నూనె లేదా నెయ్యిలో నాన బెట్టుకొవాలి. ఆ తర్వాత ఆ వత్తుల్ని ఒక దీపం ప్రమిధలో పెట్టుకొవాలి. ప్రమిధకు పసుపు, కుంకుమను అద్దాలి. దీపంపు ప్రమిధను నేరుగా నెలపైన పెట్టకుండా ఒక తమలపాకు లేదా బియ్యంను, రాగి పాత్రను కింద పెట్టాలి. దీని చుట్టు అష్టాదళ పద్మంను వేయాలి. ఆ తర్వాత వత్తుల మీద కర్పూరంను చూర్ణం వేసి వేయాలి.
సుగంధ భరితమైన అగరబత్తిని వెలిగించి దానితో దీపంను వెలిగించాలి. దీపంవెలిగించిన తర్వాత దానికి నమస్కరించి దామోదరయా అని లేదా శివాయ అని గానీ స్మరించుకొవాలి. దాని ముందు ఒక పువ్వును పెట్టాలి.ఈ విధంగా భక్తి శ్రద్దలతో 365 గుత్తిదీపంను వెలిగించాలి. ఇంట్లో పెద్దవారు లేదా యజమాని ఈ దీపంను వెలిగిస్తే మంచిదని అనాదీగా పెద్దలు చెబుతారు. ఏడాది పాటు దీపం వెలిగించలేని వారు ఏదైన కారణాలతో దీపం వెలిగించడంలో విఘ్నాలు వచ్చిన వారు ఈ 365 గుత్తి దీపంను కార్తీకంలో వెలిగిస్తే ఆ దోషాలన్ని పోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.