• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Marriage Dates: పెళ్లిళ్లు చేసుకొనే వారికి శుభవార్త.. పవిత్రమైన కార్తీక మాసంలో శుభమూహుర్తాలు ఇవే..

Marriage Dates: పెళ్లిళ్లు చేసుకొనే వారికి శుభవార్త.. పవిత్రమైన కార్తీక మాసంలో శుభమూహుర్తాలు ఇవే..

Wedding dates in November: నవంబర్ 10 నుంచి మనం కార్తీక మాసంను జరుపుకుంటాం. ఈ క్రమంలో కొన్ని రోజులుగా మూఢమి ప్రభావంతో ఆగిపోయిన శుభకార్యాలు మరోసారి ఊపందుకొనున్నాయి.

Written ByInamdar Paresh
Published: Nov 01, 2026, 10:28 AM IST|Updated: Nov 01, 2026, 10:44 AM IST
joinshare
Marriage Dates: పెళ్లిళ్లు చేసుకొనే వారికి శుభవార్త.. పవిత్రమైన కార్తీక మాసంలో శుభమూహుర్తాలు ఇవే..
Image Credit: weddingtradition(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చేపల పులుసులో బెండకాయ.. అసలు రుచి వెనుక సీక్రెట్ ఇదే..!!

చేపల పులుసులో బెండకాయ.. అసలు రుచి వెనుక సీక్రెట్ ఇదే..!!

2

తెలుగు తెరపై ‘కొరివి’ దెయ్యం కథ.. టైటిల్ పోస్టర్‌తో సినిమాపై పెరిగిన అంచనాలు..

3

EPFO Whatsapp Service: ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు, పాత ఖాతాలకు ఆటో సెటిల్‌మెంట్!

4

Raptadu Girl Incident: రంపం దాడి ఘటనతో షాక్‌లో స్కూల్ విద్యార్థులు.. మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం..

5

Raptadu Incident Update: రాప్తాడు పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో దాడి..నిందితుడు విద్యార్థిని వరుసకు బాబాయ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika masam wedding dates: గత కొన్ని రోజులుగా మూఢం కారణంగా అన్ని రకాల శుభకార్యాలకు బ్రేకులు పడ్డాయి. అయితే. నవంబరు మాసం స్టార్ట్ కావడంతో పాటు మరి కొన్ని రోజుల్లో కార్తీక మాసం కూడా ప్రారంభమౌతుంది. కార్తీక మాసంను అత్యంత పవిత్రమైన మాసంగా చెబుతారు.ఈ మాసం శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందుకే నెల రోజుల పాటు  సూర్యోదయంకు ముందే స్నానం, దీపారాధన, నదీస్నానం, తలసీ ఆరాధన, ఉసిరి దానం మొదలైనవి  చేయాలని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో మనం నవంబరు 10 నుంచి పెళ్లిళ్లు, నూతన గృహప్రవేశం, అన్నప్రాసన, నూతన వాహన కొనుగోళ్లు, కేశ ఖండన  మొదలైన వాటికి అత్యంత శుభమూహుర్తాలు ఉన్నాయని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

నవంబర్10 నుంచి 18 రోజుల పాటు శుభమూహుర్తాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. నవంబరు 10,12, 21,25,26 మంచి మూహుర్తాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. దీనితో పాటు ఆయా రాశుల వారికి శుభకార్యాలకు జాతకాలను పండితుల వద్ద చూయించుకుని మూహుర్తాలు తీయించుకొవాలని పండితులు సూచిస్తున్నారు. మనకు తెలుగు మాసాలు అన్నింటిలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది.ఈ నెలల మనం చేసే పూజలు, వ్రతాలు అత్యంత యోగదాయకంఅవుతాయి. 

ఈ నెలల నదీస్నానం, వనభోజనం, అన్నసమారాధాన, పండితులకు యథా శక్తి దానం మొదలైనవి చేయాలి.ఈ విధంగా చేస్తే అన్ని రకాల దోషాలు పోయి శుభయోగాలు ప్రాప్తిస్తాయి. పెళ్లి మూహుర్తాలు మరల మొదలు కావడంతో క్యాటరింగ్ సిబ్బంది, డెకొరేషన్, పండితులు, ఫోటో, వీడియోలు, సన్నాయి, డప్పులు,డీజే మొదలైన వారికి మరల చేతి నిండా పని దొరుకనుంది. మరోవైపు పెళ్లికానీ వారు కొన్ని రెమిడీలు పాటించాలి.

 గురుబలం పెరగడానికి ఆవుకు నానబెట్టిన ఎర్రటి శెనగలు పెట్టాలి. ఆవుకు దాణాపెట్టాలి.దుర్గమ్మ తల్లికి నెయ్యితో దీపారాధన చేయాలి. స్నానం చేసే ముందు బకెట్ లో చిటికెడు పసుపువేసుకుని స్నానం చేయాలి. గమనిక- ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం,విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals
Telugu Astrology
Astrological Remedies