SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

Karthika Masam Deepa Danam: కార్తీక మాసంలో చాలామంది దీపా దానం చేస్తూ ఉంటారు. దీపా దానం చేయడం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల నుంచి వస్తున్న ఒక నమ్మకం. దీపా దానం ఎవరికి చేయడం మంచిది? అసలు దీపాలు ఎక్కడ వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది? పూర్తి వివరాలేం ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 11:02 AM IST | Updated: Nov 15, 2026, 11:05 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Karthika Masam Deepa Danam: హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించే కార్తీక మాసంలో దీపదానంకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో దీపదానంతో పాటు దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని.. జన్మజన్మల పాపాలు నశించి దారిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతూ ఉంటారు. స్కంద పద్మ పురాణాల ప్రకారం చీకటిని తొలగించి వెలుగులనిచ్చే దీపాన్ని దానం చేయడం సకల దానాల్లోకెల్లా ఉత్తమమైనదని పేర్కొన్నారు. కాబట్టి ఈ సమయాల్లో చాలామంది దీపా దానం చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు..

శాస్త్రాల ప్రకారం.. దీప దానాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా.. భక్తిశ్రద్ధలతో చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దేవాలయ ప్రాంగణాల్లో.. నది తీరాల్లో. తులసి కోట వద్ద లేదా రావి ఉసిరి చెట్ల కింద దీపాలను వెలిగించడం ఒక పద్ధతి కాగా.. వేద పండితులకు, బ్రాహ్మణులకు, పేదలకు, అవసరంలో ఉన్నవారికి చేతితో కూడిన దీపకు కుందులను, వత్తులను దానం చేయడం అసలైన దీప దానంగా పరిగణిస్తూ వస్తారు. ముఖ్యంగా చీకటిగా ఉండే ఆలయ మార్గాల్లో ఇతరులకు దారి చూపేలా దీపాన్ని ఉంచడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలనుంచి వస్తున్న ఒక విశ్వాసం..

కార్తీక మాసంలో దీపా దానానికి సూర్యోదయానికి ముందు వచ్చే బ్రహ్మ ముహూర్తం అలాగే సూర్యాస్తమయం తర్వాత వచ్చే సంధ్యా సమయానికి అత్యంత అనుకూలమైనవి. ఈ సమయాల్లో ప్రకృతిలో సాత్విక శక్తి అధికంగా ఉంటుందని.. అప్పుడు చేసే దీపా దానం తక్షణ శుభ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తూ వస్తున్నాయి. కార్తీక పౌర్ణమి, ఏకాదశి, సోమవారాలు ఈ దానానికి మరింత విశేషమైన రోజుగా భావించవచ్చు..

దీపదానం కేవలం ఆర్థిక ఇబ్బందులను తొలగించే ప్రక్రియ మాత్రమే కాదని.. దీని వెనక లోతైన మానసిక ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతూ వస్తున్నారు.. ఆధ్యాత్మికంగా దీపం జ్ఞానానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు.. అజ్ఞానమని అంధకారాన్ని తొలగించి.. మనసులోని జ్ఞాన జ్యోతిని వెలిగించడమే దీని అంతరార్థం.. ఇక మానసిక కోణంలో చూస్తే.. దానం చేసే గుణం మనిషిలో స్వార్ధాన్ని.. అహంకారాన్ని తగ్గిస్తూ ఉంటుంది.. ఇతరులకు సహాయపడుతున్నానని తృప్తి మనసులో ఒత్తిడిని తగ్గి.. సానుకూలమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది.. ఏకాగ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు వ్యక్తి తన వృత్తి తో పాటు వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.. దీనివల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి దారిద్రం దూరమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES