SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కార్తీక మాసంలో ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు..

Karthika Masam Zodiac Signs: కార్తీక మాసం తెలుగు మాసాల్లో 8వ నెల. ఇది విష్ణువు, శివుడికి సంబంధించిన అత్యంత పవిత్రమైన మాసంగా గుర్తింపు పొందింది. ఈ నెలలో లేనట్టుగా ఈ నెలలోనే నదీ స్నానాలు, కార్తీక సోమవారం వ్రతం, కార్తీక ఏకాదశి, చిలుకు ద్వాదశి, కార్తీక పౌర్ణమి అని, కేదారేశ్వర స్వామి నోము, సత్యనారాయణ కథ ఇంటింట చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు చేకూర్చనున్నాయట.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 12:08 PM IST | Updated: Nov 07, 2026, 12:14 PM IST
Image Credit: Karthika Masam Zodiac Signs (AI Pic/Source)
Join

Karthika Masam Rasi Phalalu: కార్తీక మాసంలో చేసే చిన్న పని కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. శివుడికి సంబంధించిన అభిషేకాలు, లక్ష్మీ నారాయణలకు సంబంధించన పూజలకు పెట్టింది పేరు. ఈ మాసంలో చేసే పూజాదికాలు ఇతరత్రా పూజాలతో మీపై ఉన్న అరిష్టాలు, జాతక దోషాలు తొలిగిపోతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు నాగరాజ్ శర్మ చెబుతున్న మాట.

మేష  రాశి..

ఈ మాసంలో ఈ రాశి వారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం  మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగబోతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీకు ఆర్ధికంగా దోహదం చేస్తాయి.

ధనస్సు రాశి..

కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు ఎదరువుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో  స్వల్ప వివాదాలు రేకెత్తుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొనే అవకాశాలున్నాయి.  

కర్కాటక రాశి..

సన్నిహితులతో కలిసి పుణ్యక్షేత్ర  దర్శనాలు  చేసుకుంటారు. కుటుంబ  సభ్యులకు మీ ఆలోచనలు నచ్చుతాయి.  చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ ఆధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి  ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

కుంభ రాశి..

ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేపడుతారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను  సమర్దవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.

మీన రాశి.. 

ఉద్యోగమున అధికారులతో వాదనలకు దిగకూడదు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.  వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా మారనున్నాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు బాధించే అవకాశాలున్నాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత ఎదుర్కొక తప్పదు.

కన్య రాశి..

బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విద్యార్ధులకు అనుకుల పరిస్థితులు ఏర్పడుతాయి.  ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు   మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపడుతుంది.  

వృషభ రాశి..

దూర ప్రయాణాలలో అంతగా కలిసిరావు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం అత్యంత శ్రేయస్కరం.  నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.


సింహ రాశి.. 
సింహ రాశి వారికి కార్తీక మాసం మిశ్రమ ఫలితాలుంటాయి. అన్ని విషయాల్లో దూకుడు పనికిరాదు. వృధా ప్రయాణాలు కలిసి రావు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో  చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి.  స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన మీకు మన: శాంతి కలుగుతుంది. 
 

మిధున రాశి..

ఆర్ధిక  పరంగా అనుకూల పరిస్థితులు మీకు కలిసొచ్చే అవకాశాలున్నాయి.  ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. స్త్రీ, పురుషులకు వివాహా యోగం. వ్యాపార పరంగా ఉన్నతంగా ఉండబోతుంది. కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి.


తులా రాశి..

ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదిస్తారు.  ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయి.  ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగే అవకాశాలున్నాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగే అవకాశాలున్నాయి. అవసరానికి చేతిలో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలిగిపోతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.

మకర రాశి..

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండనుంది. ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంచెం తగ్గుతాయి.  దైవ సంబంధిత   కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు.

Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. గ్రహ దోషాల నివారణ కోసం నవగ్రహ శ్లోకాలను జపించండి.  ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES