Maha Navami 2026: మహార్నవమి వేళ కొత్త వాహనాలు కొంటున్నారా..?.. ఈ రహస్య విషయాలు మీకు తెలుసా.?.
Durga navratri tradition: ఆయుధ పూజలు పూర్వకాలంలో నవమి రోజున చేసేవారు. అవి యుద్దంను, విజయాన్ని కొరతాయంటారు. ఈ రోజున కొత్త వాహనాలు కొనడం వల్ల కొంత మందికి కలిసి రాదని, ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుందని కొంత మంది వాదిస్తున్నారు.
Maha Navami date 2026 tradition and vahana puja rituals: దేశంలో ఎక్కడ చూసిన దుర్గానవరాత్రుల ఉత్సవాలను భక్తి, భావనలతో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఉత్సవాలు అంతిమ దశకు చేరుకున్నాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తారు. మనం అక్టోబరు 19న సోమవారం రోజున నవమిని జరుపుకుంటాం. ఈ రోజున అమ్మవారు సిద్దిదాత్రి రూపంలో అనుగ్రహిస్తారు. అమ్మవారు సింహం మీద సంచారం చేస్తారు. నవమి రోజున అనాదీగా కొత్త వాహనాలు చేయడం ఆచారంగా పాటిస్తు వస్తున్నారు.
అయితే.. ఒకవైపు రేపటి నుంచి మూఢాలు, మరోవైపు నవమి రోజున వాహనాలు కొనుగోలు చేయడంపై అనేక వాదనలు తెరమీదకు వస్తున్నాయి. శుక్రమౌఢ్యమి నేపథ్యంలో అక్టోబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు చేయోద్దని పండితులు చెబుతున్నారు. కానీ చాలా మంది అనాదీగా నవమి రోజున ఆయుధ పూజలు నిర్వహిస్తారు. తమ వాహనాలకు పూజలు చేస్తారు. కొంత మంది తాము ఉపయోగించే వాటిని ఆయుధంగా భావించి పూజిస్తారు.
నవమి రోజున ఆయుధ పూజలు..
పాండవులు శమీ చెట్టు మీద తమ ఆయుధాలను దాచి ఉంచుతారు. నవమి రోజున తమ ఆయుధాలను కిందకు తీసి కౌరవులతో యుద్దం చేసి దశమి రోజున విజయం సాధిస్తారు. అదే విధంగా అమ్మవారు సైతం దశమి రోజున మహిషాసురుడ్ని హతమారుస్తారు.
చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా మనం దసరాను జరుపుకుంటాం. ఆయుధ పూజలు పూర్వకాలంలో నవమి రోజున చేసేవారు. అవి యుద్దంను, విజయాన్ని కొరతాయంటారు. ఈ రోజున కొత్త వాహనాలు కొనడం వల్ల కొంత మందికి కలిసి రాదని, ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుందని కొంత మంది వాదిస్తున్నారు.
అందుకే నవమికి బదులు విజయ దశమి రోజున కొత్త వాహనాలు లేదా కొత్త పనులు చేయాలని దీని వల్ల అమ్మవారి ఆశీస్సులతో గొప్ప విజయాలను ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గమనిక.. ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)..