• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?

Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?

Deputy mro suicide in bhadradri kothagudem: కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లను డిప్యూటీ తహసీల్దార్ తన సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో సంచలనంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 18, 2026, 09:29 AM IST|Updated: Oct 18, 2026, 09:34 AM IST
joinshare
Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?
Image Credit: deputy mro suicide in bhadradri kothagudem

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Maha Navami 2026: మహార్నవమి వేళ  కొత్త వాహనాలు కొంటున్నారా..?.. ఈ రహస్య విషయాలు మీకు తెలుసా.?.

Maha Navami 2026: మహార్నవమి వేళ కొత్త వాహనాలు కొంటున్నారా..?.. ఈ రహస్య విషయాలు మీకు తెలుసా.?.

2

Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?

3

బాలీవుడ్ దర్శకులకు గేట్లు క్లోజ్ చేసిన మన హీరోలు.. సౌత్ దర్శకులే బెస్ట్ అంటున్న హీరోలు..

4

Garbha Dress Row: గర్బాలో ఇదెక్కడి అరాచకం... మహిళల దుస్తులపై నెట్టింట రచ్చ.. వీడియో వైరల్..

5

రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Deputy tahsildar commits suicide in Bhadradri kothagudem: దేశ వ్యాప్తంగా దసరా పండగ వేడుకను కన్నుల పండగలా జరుపుకుంటున్నారు.  నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్టించుకుని వైభవంగా కొలుచుకుంటున్నారు.అయితే. దసరా వేళ చాలాచోట్ల మాముళ్లు వసులు చేస్తారు. పండగ వేళ కొంత డబ్బులను ఇవ్వాలని కోరుతారు. ఇదంతా ఒక సంప్రదాయంగా వస్తుంది. కానీ దీన్ని కొంత మంది మాత్రం బలవంతంగా పండగ మాముళ్ల రూపంలో వసులు చేస్తే ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అధికారులను మాముళ్లు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్త గూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా తనను దసరా మాముళ్ల పేరిట ఆఫీస్ స్టాఫ్ తో పాటు పలువురు రిపోర్టర్ల వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి భద్రాచలంలోని ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు దసరా మాముళ్లు ఇవ్వకుంటే లైంగికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తరచుగా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. 

కోటి రూపాయలు ఇవ్వాలని కొంత మంది తనను తీవ్రంగా వేధించినట్లు ఆ నోట్ లో డిప్యూటీ తహసీల్దార్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై తీవ్ర మనస్తాపంకు గురైన డిప్యూటీ తహసీల్దార్  భద్రాచలంలోని ప్రైవేట్ లాడ్జికు వచ్చి అక్కడ గదిని బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వేధించిన వారిపేర్లు సూసైడ్ నోటోలో రాసి డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. 

చాలా సేపు గది నుంచి సదరు వ్యక్తి బైటకు రాక పొవడంతో హోటల్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. కిటికి నుంచి చూడగా ఆయన సూసైడ్ చేసుకుని కన్పించారు. వెంటనే పోలీసులకు లాడ్జీ సిబ్బంది సమాచారం అందించారు. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని దానిలో ఉన్న వారి పేర్లు,ఘటనకు గల కారణాపై విచారన చేపట్టారు. దసరా పండగ వేళ ఈ ఘటన మాత్రం తీవ్ర విషాదకరంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News
Telugu News