స్వాతి నక్షత్రంలో బుధుడు.. నవంబర్ 25 వరకు ఈ రాశులవారు ఉద్యోగం, డబ్బు విషయంలో జాగ్రత్త!
బుధుడి నక్షత్ర సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి సమస్యలు తప్పవని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే నష్టాల్లో కూడుకునే ఛాన్స్‌లు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కూడా అనేక సమస్యలు కూడా వస్తాయి.
Mercury Transit 2026 Effect: బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహ రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచార చాలా కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే బుధుడు నవంబర్ మొదటి వారంలో.. అంటే ఈ మంగళవారం స్వాతి నక్షత్రంలోకి సంచారం చేశాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నక్షత్రాన్ని రాహువు పాలిస్తాడు. అయితే, ఈ సమయంలో రాహువు నక్షత్రంలోకి బుధుడు వెళ్లడం వల్ల కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కింది రాశులవారు అనేక సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బుధుడు నవంబర్ 3వ తేదిన ఉదయం 6 గంటలకు స్వాతి నక్షత్రంలోకి సంచారం చేశాడు. అయితే, నవంబర్ 25వ తేది వరకు అదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడు. ఆ తర్వాత బుధుడు వైశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.. అప్పటి వరకు ఈ రాశులవారిపై బుధుడి ప్రభావం కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారిపై ఊహించని ప్రభావం..
మకర రాశి
రాహువు పాలించే స్వాతి నక్షత్రంలోకి బుధుడు సంచారం చేయడం వల్ల మక రాశివారికి ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి సమస్యలు వస్తాయి. అలాగే అనేక వివాదాలు కూడా తలెత్తే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అధిక మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఈ సమయంలో అనేక అపార్థాలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.
తులారాశి
స్వాతి నక్షత్రంలో బుధ సంచారం చేయడంతో తులా రాశివారికి కూడా ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆటంకాలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదర్కొంటారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి కూడా సమస్యలు వస్తాయి. సహోద్యోగుల నుంచి వాదనలు కూడా వస్తాయి. దీంతో పాటు విభేదాలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి
స్వాతి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కర్కాటక రాశివారికి కూడా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఆదాయం కూడా విపరీతంగా లభించినప్పటికీ.. దాని కంటే ఎక్కువగా ఖర్చులు రావచ్చు. మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా విపరీతంగా వస్తాయి. పనుల్లో ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. విద్యార్తులు చదువులపై ఏకాగ్రత పెంచుకోవడం చాలా వరకు మంచిది లేదంటే.. ఎన్నో రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
కుంభ రాశివారికి కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పెట్టుబడి నిర్ణయాలు కూడా తీసుకునే క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని విజయాల్లో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
NOTE: