Ramayana Part 1 Review: రామాయణ సినిమా ఫస్ట్ ప్రీమియర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో పడింది. ఇంటర్నేషనల్ క్రిటిక్స్‌కు ఈ ఎపిక్ వండర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నితీష్ తివారి డైరెక్షన్ విజన్, నమిత్ మల్హోత్రా, యశ్ ప్రొడక్షన్ వాల్యూస్ రామాయణను టైమ్ లెస్ క్లాసిక్‌గా నిలుపుతాయంటున్నారు. అయితే యశ్ ముందుగానే చెప్పినట్లు విజువల్ ఎఫెక్ట్స్ విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేయాలనే టాక్ అయితే కొంత మేర నడుస్తుంది.
నటీనటుల పర్ఫామెన్స్..
రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్‌తో మేజర్ హైలైట్‌గా నిలిచారని క్రిటిక్స్ చెప్తున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి చాలా సిన్సియర్‌గా అటెప్ట్ చేసినట్టు చెబుతున్నారు. సీతారాముల పాత్ర కంటే రావణ బ్రహ్మగా యశ్ తన ననటతో మాయ చేసాడనే టాక్ వినిపిస్తుంది. తన ఇంటెన్స్ యాక్టింగ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా మారిపోయారని హాలీవుడ్ ఆడియన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.
సెకండ్ పార్ట్ పై ఆసక్తి..
సెకండ్ పార్ట్‌పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్‌ని డిజైన్ చేసిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదిరిపోయే విజువల్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ రామాయణని బెస్ట్ థియేట్రికల్ వాచ్‌గా నిలబెట్టాయని తెలుస్తుంది. లాస్ ఏంజిల్స్ వరల్డ్ ప్రీమియర్ రిపోర్ట్స్ ప్రకారం.. అక్కడక్కడా మైనస్‌లు ఉన్నా కూడా ఈ ఎపిక్ డ్రామా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం పక్కా అనే టాక్ అయితే నడుస్తుంది. మరోవైపు హిందీలో తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు 5 స్టార్స్‌కు 5 స్టార్స్ వేసి ఆశ్చర్యపరిచారు. మొత్తంగా విడుదలకు ముందే క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందనేది చూడాలి మరి.