SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

లక్ష్మీనారాయణ రాజయోగంతో జాక్‌పాట్.. ఈ 4 రాశుల వారికి భారీగా ధనలాభాలు!

Lakshmi Narayana Rajayoga 2026: సెప్టెంబర్ 26వ తేదీన ఏర్పడిన ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయని ఆయన చెబుతున్నారు. అయితే ఏ రాశుల వారికి జాక్పాట్ దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 10:24 AM IST | Updated: Sep 27, 2026, 10:26 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Lakshmi Narayana Rajayoga 2026 Effect: గ్రహాల కలయిక కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో వీటికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అత్యంత శక్తివంతమైన యోగంగా చెప్పుకునే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడితే కొన్ని రాశుల వారికైతే ఎలాంటి తిరుగు ఉండదు. ఈ యోగాన్ని ధనంతో పాటు ఆనందం విజయాలకు సూచికగా భావిస్తారు. బుధుడితో పాటు శుక్ర గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని మేధస్సుతోపాటు వ్యాపారానికి అధిపతిగా భావిస్తారు.. ఇక శుక్ర గ్రహాన్ని సంపాదన ధనం విలాసవతానికి సూచికగా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే ఈ రెండు గ్రహాల కలయికనే ఈ యోగంగా భావించవచ్చు.. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 26వ తేదీన శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. అయితే దీని ప్రభావం నవంబర్ ఆరవ తేదీ వరకు కొనసాగుతుందని ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అయితే ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎక్కువగా లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి భారీ:
మిథున రాశి 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిథున రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని.. ఈ సమయంలో వృత్తి ఆర్థికపరమైన విషయాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వ్యాపారవేత్తలకు ఈ సమయము ఎంతో లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుబోతోందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు భారీ మొత్తంలో సొంతం చేసుకోగలుగుతారు. కళాకాలంగా నిలిచిపోయిన డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది. అలాగే వీరు తమకు నచ్చిన ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని తప్పకుండా శుభవార్తలు కూడా వింటారు.

వృషభ రాశి 
వృషభ రాశి వారికి కూడా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి కొత్త బాధ్యతలు లభించి పనుల్లో అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. విలాసాలు పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. తప్పకుండా శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండి ముందుకు సాగడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకెళ్లడం వల్ల సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటారని వారు చెబుతున్నారు..

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావం విశేషమైన ప్రయోజనాలనుందించబోతూ ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము నెలకొంటుందని ఆయన చెబుతున్నారు. సంబంధాల్లో మాధుర్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేసే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.. ఇళ్లతో పాటు కార్లు కొనుగోలు చేసి అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు తప్పకుండా ఉద్యోగం లభించబోతోంది.

కన్యా రాశి 
కన్యా రాశి వారికి కూడా లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా అదృష్టం కలిసి రావడమే కాకుండా ఆలోచన శక్తి పెరిగి మంచి మెరుగుదల కనిపిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. గతంలో పెట్టిన పెట్టుబడులనుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. అలాగే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది.. ముఖ్యంగా ఈ సమయంలో చేసిన పొదుపు కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది.. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES