దేవీ నవరాత్రులు 2026.. ఈ 9 రోజులు అసలు చేయకూడని 5 పనులు ఇవే.. జాగ్రత్త!
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు. ఈ రోజుల్లో అమ్మవారిని ఉపవాసం ఉండి, ఎంతో నిష్టతో కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారం చేసే దుర్గా అమ్మవారి పూజకు అంతా రెడీ అయిపోయారు. అయితే, ఈ తొమ్మిది రోజుల పాటు చేయకూడని ఐదు పనులు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం.
Navaratri 2026: దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ఇప్పటికే సిద్ధమవుతున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. బాల త్రిపురసుందరి దేవితో ప్రారంభమై మహిషాసుర మర్దిని వరకు పూజలు జరుగుతాయి. ఈ సమయంలో అఖండ దీపం, కలశ స్థాపన వంటివి నిర్వహిస్తారు. అయితే, భక్తితో పూజించడమే కాకుండా, కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.
దుర్గామాతను ప్రతిష్ఠించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు భక్తితో పూజలు చేస్తూ, అమ్మవారికి ఇష్టమైన వివిధ ప్రసాదాలను సమర్పిస్తారు. ఉపవాస నియమాలను పాటిస్తూ ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. నవరాత్రులలో చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే:
నవరాత్రులలో ప్రధానంగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసం, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. కోడిగుడ్లు, మాంసం, మద్యం, ధూమపానం, ఉల్లి, వెల్లుల్లి, ప్రాసెస్ చేసిన స్పైసీ ఫుడ్స్ వంటి వాటిని అస్సలు ముట్టుకోకూడదు. ఉపవాసం ఉండేవారు పాలు, మఖానా, సబుదానా వంటి సాత్విక పదార్థాలను తీసుకుంటారు. నవరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రాంతాల్లో భిన్నంగా ఉండవచ్చు, వాటిని పాటిస్తే సరిపోతుంది.
నవరాత్రులలో జుట్టు కత్తిరించుకోకూడదు, షేవింగ్ చేయకూడదు. ఈ సృష్టికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించే సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు.
అలాగే, నవరాత్రులలో ఇతరులపై కోపం తెచ్చుకోకూడదు, గొడవలకు దిగకూడదు. ఎవరినీ తిట్టకూడదు. క్రమశిక్షణతో, శాంతంగా ఉండాలి. అమ్మవారి పూజ చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటే, ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలతో గొడవ పడకండి, అనవసరమైన మాటలు అనకండి. ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకండి. మనసులో ఏది ఉంటే అమ్మవారు మనకు అదే ప్రసాదిస్తారు, కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
పూజలు, వ్రతాలు చేసే ప్రదేశాలు ఎంతో శుద్ధిగా ఉండాలి. కలశ స్థాపన చేసే చోట ఎంతో శుభ్రత పాటించాలి. కలశ స్థాపనకు సంబంధించిన వస్తువులు శుభ్రంగా ఉండాలి. వాడిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు తీసేయాలి. పూజా ప్రాంతంలో దుమ్ము లేకుండా చూసుకోవాలి. పూజా వస్తువులను క్రమం తప్పకుండా మార్చుకోవాలి. చెప్పులను ఇంటి బయట ఒకచోట ఉంచాలి. అఖండ జ్యోతిని జాగ్రత్తగా చూసుకోవాలి.
ముందుగా పూజా విధానం, నియమాలను తెలుసుకుని మాత్రమే ఈ నవరాత్రులను పాటించండి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపవాస ఆహార నియమాలు, ఘటస్థాపన, రోజువారీ పూజలు, కన్యా పూజ వంటి అంశాలలో జాగ్రత్త వహించాలి. జుట్టు లేదా గడ్డం కత్తిరించుకోకూడదు, పగటిపూట నిద్రపోకూడదు. అమ్మవారికి ఎప్పటికప్పుడు పూజలు, ప్రసాదాలు సమర్పిస్తూ, కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)