• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

దసరా, సద్దుల బతుకమ్మ పండుగలకు సంబంధించి పురోహితులు కీలక సమాచారాన్ని అందించారు. విజయదశమి అక్టోబర్ 19 లేదా 20వ తేదీన ఉంటుందనే సందేహాలపై పండితులు స్పష్టతనిచ్చారు. ఈ నెలలో అమావాస్య ఉన్నందున, నవరాత్రులు 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇక 20వ తేదీన విజయదశమి పండుగను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Written ByRenuka Godugu
Published: Oct 03, 2026, 02:44 PM IST|Updated: Oct 03, 2026, 02:46 PM IST
joinshare
దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!
Image Credit: Dussehra 2026 Dates

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
NTR: చుట్టమల్లే AI వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. ఇక ఊరుకునేది లేదంటూ వార్నింగ్

NTR: చుట్టమల్లే AI వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. ఇక ఊరుకునేది లేదంటూ వార్నింగ్

2

దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

3

Nayara Petrol Hike: ఇంధన వినియోగదారులకు పిడుగు లాంటి వార్త..పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 నయారా పెంపు!

4

Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

5

Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dussehra 2026 Dates: మన దేశంలో విజయదశమి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను నవరాత్రుల అనంతరం నిర్వహిస్తారు. ఇదే సమయంలో తెలంగాణా అంతటా పది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు కూడా జరుగుతాయి. దసరా నవరాత్రుల తేదీల విషయంలో చాలా మందికి ఉన్న సందేహాలను పండితులు నివృత్తి చేశారు. అక్టోబర్ 11 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. తెలంగాణలో అమావాస్య నుంచే బతుకమ్మ పండుగ మొదలవుతుంది. పండితుల సూచనల ప్రకారం, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మను, 19న మహర్నవమి, 20న విజయదశమి పండుగను నిర్వహించాలి. 20వ తేదీ సాయంత్రం జమ్ము చెట్టు పూజతో వేడుకలు జరుగుతాయి. అలాగే తెలంగాణలో దసరా రోజున పాలపిట్టను చూడటం కూడా ఒక ఆచారం.

దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి దసరా అక్టోబర్ 20, మంగళవారం నాడు వస్తుంది. దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడం శుభప్రదమని, ఇది విజయ ముహూర్తం అని నమ్ముతారు. దీనికి ముందు రోజు ఆయుధ పూజ కూడా నిర్వహిస్తారు. దసరా సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాలలో సూర్యాస్తమయం సమయంలో రావణ దహనం జరుగుతుంది. ముఖ్యంగా రాంలీల మైదానంలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.

విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయం కాబట్టి, ఈ రోజున గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా మంచిదని చెబుతారు. ఈ రోజు ప్రారంభించిన వ్యాపారం విజయవంతం అవుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాదిలో అపరాజిత దేవితో పాటు జయవిజయలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తెలంగాణలో అమావాస్య నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమై, తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, చివరిగా సద్దుల బతుకమ్మతో వేడుకలు పూర్తవుతాయి. అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ రాగా, 20వ తేదీన విజయదశమి పండుగను నిర్వహించుకోవాలి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals