SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా? ఏం తినాలి? ఏవి తినకూడదు? 9 రోజుల రోజువారీ ఫుడ్ గైడ్!

అక్టోబర్‌ 11వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని, ఈ 9 రోజులపాటు ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే, ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్‌ తినాలి? ఏ ఫుడ్స్‌ తినకూడదు? ఆ లిస్ట్‌ ఏంటి తెలుసుకుందాం.

Reported By Renuka Godugu Written By Renuka Godugu
Published: Oct 09, 2026, 04:55 PM IST | Updated: Oct 09, 2026, 05:00 PM IST
Image Credit: Navratri 2026 Vrat Fasting Guide
Join

నవరాత్రుల సమయంలో ఉపవాసాలు పాటించేవారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటారు. సాధారణ ఉప్పు కూడా తినరు. ఈ 9 రోజులు అమ్మవారి తొమ్మిది అవతారాలను పూజిస్తారు. దేశవ్యాప్తంగా కూడా దసరా నవరాత్రులను అంగరంగా వైభవంగా జరుపుకొంటారు. ఈ సమయంలో కేవలం సాబుదాన, పండ్లు, పాలు, రాళ్ల ఉప్పు, ఊదలు వంటివి తీసుకుంటారు. శారదీయ నవరాత్రులు కలశస్థాపనతో ప్రారంభం అవుతుంది. దసరా వరకు జరపుకొంటారు.. అయితే, ఉపవాసం సమయంలో ఏ ఫుడ్‌ తినాలి? ఏం తినకూడదు? ఆ పూర్తి జాబితా తెలుసుకుందాం.

సాబుదానతో కిచిడీ, ఊదలు వంటివి తింటూ ఉండాలి.
ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి పనీర్‌, పల్లీలు, మఖానా, పెరుగు, పాలు మీ రోజువారీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి
కేవలం రాళ్ల ఉప్పు మాత్రమే వాడండి.
జిలకర్ర, నల్లమిరియాలు, పచ్చిమిర్చి, యాలకులు మీ రిసిపీల్లో చేర్చుకోండి. ఏ రోజుకు ఆరోజు తాజాగా వండుకుని తినండి.

ఇక ఉపవాసం సమయంలో చిన్న మొత్తంలో తినండి. దీంతో శక్తి కూడా లభిస్తుంది
ఎప్పటికప్పుడు కొబ్బరినీరు, నీళ్లు, నిమ్మరసం తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండండి. పాలు, పెరుగు, మజ్జిగ, పనీర్‌ తీసుకోండి. ఉపవాసం సమయంలో డీప్‌ ఫ్రై చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

Read Also: దసరా నవరాత్రులు.. పూజకు ముందు ఇల్లు శుభ్రం చేస్తున్నారా? ఈ 5 పొరపాట్లు అస్సలు చేయొద్దు!
 

ఇక నవరాత్రుల సమయంలో నాన్‌ వెజ్‌కు దూరంగా ఉంటారు. అదే విధంగా గోధుమలు, రైస్‌, మైదా కూడా తినరు. కొన్ని కుటుంబాలు అయితే, పసుపు, ఆవాలు, రీఫైండ్‌ ఆయిల్‌ కూడా తీసుకోరు. కేవలం నెయ్యి, పల్లి నూనె మాత్రమే వాడతారు. కొంతమంది నవరాత్రుల సమయంలో టీ, కాఫీ కూడా తీసుకోరు. ఉపవాసంలో కొంతమంది పాలు, పండ్లు తీసుకుంటారు.  లేదా ఒక మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్‌ తింటారు. కొంతమంది నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఇక నవరాత్రులు పాటించే మరికొంతమంది కేవలం మొదటి, చివరి రోజు మాత్రమే ఉపవాసం పాటించేవారు కూడా ఉంటారు.

ఈ పనులు చేయకండి..
అయితే, నవరాత్రుల సమయంలో కొన్ని పనులు కూడా పొరపాటున చేయకూడదు.
జుట్టు కట్‌ చేయడం, షేవింగ్‌, గోళ్లు కట్‌ చేయడం చేయరు.
ఆల్కహాల్‌, ఇతరులను తిట్టడం, మధ్యాహ్నం నిద్రపోరు. కొంతమంది బెడ్‌పై కూడా పడుకోరు.

మీల్‌ ప్లాన్‌ ఇలా చేయండి..
ఉదయం: నీళ్లు, పండ్లు, పాలు తీసుకోండి.
ఆ తర్వాత కొబ్బరినీరు తాగాలి.
లంచ్‌ సమయంలో ఊదలు, సాబుదాన కూరగాయలతో తీసుకోవాలి
ఈవెనింగ్‌ కొన్ని పండ్లు, మఖానా, పాలు తీసుకోవాలి.
రాత్రి సమయంలో ఊదలు, బంగాళదుంప, గుమ్మడి తీసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES