SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 1న మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులవారికి జాక్‌పాట్, ఊహించని డబ్బు!

Mahalakshmi Raj Yoga: నవంబర్‌ 1న ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 11:10 AM IST | Updated: Oct 30, 2026, 11:12 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Mahalakshmi Raj Yoga Effect: జ్యోతిష్య శాస్త్రం పరంగా నవంబర్ నెల చాలా శుభప్రదమైనదిగా భావించవచ్చు.. ఎందుకంటే నవంబర్‌ 1వ తేది ఆదివారం రోజునే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కర్కాటక రాశిలో కుజ, చంద్రుల కలయిక కారణంగానే ఈ శక్తివంతమైన మహా యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశులవారికి ఎంతో లాభదాయంగా ఉంటుంది, అంతేకాకుండా అదృష్టం కూడా చాలా వరకు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి పరంగా కూడా అద్భుతమైన పురోగతి, జీవితంలో విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుజ గ్రహాన్ని బలం, ధైర్యంతో పాటు భూమికి అధిపతిగా భావిస్తూ ఉంటారు.. అలాగే చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలతో పాటు అనుభూతులకు అధిపతిగా సూచిస్తారు.. ఈ రెండూ కలిసి నవంబర్ 1న కర్కాటక రాశిలో ఉండడం చాలా ప్రత్యేకమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీని కారణంగా ఎంతో శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది.. ఈ రాజయోగంలో 4 రాశుల వారి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుంగా గోల్డెన్‌ డేస్‌ రావడం కూడా ప్రారంభమవుతాయి.

ఈ యోగంతో వీరికి గోల్డెన్‌ డేస్‌..
కుంభ రాశి
మోస్ట్ పవర్‌ఫుల్‌ మహాలక్ష్మి రాజయోగంతో కుంభ రాశివారికి అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి పెద్ద సమస్యల నుంచి కూడా ఈ సమయంలో సులభంగా ఉపశమనం కలుగుతుంది. కార్యాలయంలోని ఉద్యోగాల పరంగా వస్తున్న ఇబ్బందులు పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆఫీసు రాజకీయాల నుంచి కూడా ఉపశమనం పొందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబంలో సంతోషం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వీరు కొత్త కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయంగా భావించే చాన్స్‌లు కూడా ఉన్నాయి. సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది.

మేష రాశి
ఈ మహాలక్ష్మి రాజయోగంతో మేష రాశివారికి కూడా గొప్ప పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.. జీతాలు కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతాయి. ఈ సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీరు పనిలో గొప్ప పురోగతి సాధించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారం కూడా పెద్ద ఎత్తున డెవలప్‌ అవుతుంది. కాబట్టి ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.

తులారాశి
నవంబర్ ప్రారంభం నుంచి తులా రాశివారికి కూడా ఈ యోగం ప్రభావంతో అనుకున్న లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆందోళన వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. వీరికి ఈ సమయంలో గొప్ప పురోగతి లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది.. జీవితంలో అభివృద్ధి చెందేందుకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.. అంతేకాకుండా వ్యాపారం కూడా వృద్ధి చెందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి.. సమయాన్ని వృథా చేయకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌తో కర్కాటక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రశాంతంగా ఉండి.. ముందుకు సాగడం చాలా మంచిది.. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.. ఈ సమయంలో మీ డబ్బు సంబంధిత సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి. బ్యాంకు ఖాతాలోకి చాలా డబ్బు కూడా భారీ మొత్తంలో లభిస్తాయి. దీనితో పాటు కార్యాలయంలో మీకు అద్బుతమైన ప్రమోషన్ కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES