SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

షడాష్టక యోగం 2026 పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. సింహం, మకరం, ధనుస్సు రాశులకు ఎలాంటి ఫలితాలు?

Shadashtak Yoga 2026 Effect: షడాష్టక యోగం ఎఫెక్ట్‌తో కొన్ని రాశుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా నవంబర్ 17వ తేదీ వరకు ఈ క్రింది రాశుల వారికి దేనికి లోటు ఉండదు. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 09:13 AM IST | Updated: Oct 20, 2026, 09:15 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Shadashtak Yoga 2026 Effect: అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు కన్యా రాశిని వదిలిపెట్టి తులా రాశిలోకి సంచారం చేశాడు. ఇక నవంబర్ 17వ తేదీ వరకు అదే రాశిలో సూర్యుడు సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. ఈ రాశి నుంచి సూర్యుని దృష్టి కుంభరాశిలో ఉన్న రాహువు పై పడుతుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. దీంతోపాటు మీన రాశిలో ఉన్న శనితో ఇదే సమయంలో ఎంతో శక్తివంతమైన షడాష్టక యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా శని సూర్యుల మధ్య ఏర్పడిన ఈ యోగంతో కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకుంటున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. అన్ని పనుల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి.. ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని అద్భుతంగా ఉన్నత స్థానాలకు చేరుతారు..

ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది..
సింహరాశి
ఈ షడాష్టక యోగం శక్తివంతమైన యోగంతో సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కొత్త ప్లానింగ్ తో ముందుకెళ్లడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. అద్భుతమైన ఆఫర్లు సొంతం చేసుకోగలుగుతారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.. వ్యాపారంలో లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా పాత పరిచయస్తుల నుంచి వ్యాపారాలు మెరుగుపడి విశేషమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా వ్యాపారాలను ముందుకు సాగించడం వల్ల వీరికి భారీ మొత్తంలో ధన లాభాలు కలుగుతాయి. కొన్ని రకాల పనులు చేసే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా మారుతుంది.

మకర రాశి 
మకర రాశి వారికి ఈ షడాష్టక యోగ ప్రభావంతో వృత్తి సామాజిక జీవితంలో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగులకు అదనపు బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పని నుంచి సానుకూలమైన ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ సమయంలో అనేక పరిస్థితుల్లో మీ బాధ్యతలను చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. క్రమశిక్షణతో వేరు ముందుకు నడిచి అనేక విజయాలు సాధించగలుగుతారు. ప్రదేశంలో అభిప్రాయాలను వ్యక్తపరిచే సమయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. సంభాసన సమతూల్లేతను పాటించడం వల్ల విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి..

ధనస్సు రాశి 
ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో కొత్త కొత్త అవకాశాలు కలుగుతాయట. ముఖ్యంగా వీరికి ఆకస్మాత్తుగా ధన లాభాలు కలగడమే కాకుండా.. కొత్త ప్రాజెక్టుల పరంగా విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు నెట్వర్క్ విపరీతంగా పెరిగి దీనివల్ల వ్యాపారాల పరంగా మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలనుంచి కెరీర్ పూర్తిగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయ వ్యాయామధ్య సమతుల్లేదా పాటించడం వల్ల సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. అనుకున్న ప్రయోజనాలు పొందగలుగుతారు.

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES