SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ 30 వరకు ఆర్థిక ఇబ్బందులు? శుక్రుడి ప్రభావంతో ఈ 4 రాశులకు కీలక సమయం..

Shukra Asta Effect: శుక్రుడి అస్తమయం వల్ల ఈ కింది రాశులవారి జీవితాల్లో అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 30 వరకు కొన్ని రాశులవారికి ఆర్థికంగా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 10:12 AM IST | Updated: Oct 15, 2026, 10:13 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Shukra Asta Effect 2026: సంపద, శ్రేయస్సుతో పాటు ఆనందానికి అధిపతిగా భావించే.. శుక్ర గ్రహం అక్టోబర్ 14న తులారాశిలో సంచారం చేసింది.. అయితే, ఈ సమయంలో శుక్రుడు అస్తమించబోతోంది. ఈ ప్రభావాన్ని కీడుగా భావిస్తూ ఉంటారు. అక్టోబర్ 14 నుంచి 30 వరకు శుక్రుడు తిరోగమన దశలో కొనసాగుతుంది.. దీని కారణంగా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థికపరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి సమస్యలే సమస్యలు:
మకర రాశి:
శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆశించిన పురోగతి కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోబం వంటి సమస్యలు కూడా రావచ్చు.. ఆదాయ పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెట్టబడులపై దృష్టి పెట్టడం చాలా మంచిది.

వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా శుక్రుడి ప్రభావంతో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. దీంతో పాటు శారీరక కర్యకాలపాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వృత్తిపరంగా కూడా అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. శుక్రుడి తీవ్ర ప్రభావంతో ఆదాయ వనరులు కూడా పూర్తిగా తగ్గుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అనేక రకాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చాలా రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

తులారాశి:
తులా రాశివారికి కూడా ఈ సమయంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన తీవ్ర సమస్యలు ఎదర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మానసిక ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదర్కొంటారు. అయితే, జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

మిథున రాశి
శుక్రుడి కీడు ప్రభావంతో మిథున రాశివారికి కూడా అనేక రకాల సమస్యలు తప్పవని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదర్కొనే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా వరకు మానుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES