SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సూర్యుడి అనుగ్రహంతో ఈ రాశులకు బంపర్ లాభాలు.. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగుండదు!

Sun Transit In Scorpio: సూర్యుడి ప్రభావంతో నవంబర్‌ 16వ తేది నుంచి ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 17, 2026, 10:00 IST | Updated: Nov 17, 2026, 10:02 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Sun Transit In Scorpio: నవంబర్ నెలలో అనేక శక్తివంతమైన గ్రహాలు సంచారం చేస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు రాశి సంచారం చేశాడు.. నవంబర్ 16 సాయంత్రం 7:48 గంటలకు సూర్యుడు తులారాశిని విడిచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం విశేషం. డిసెంబర్ 16 వరకు ఈ గ్రహం ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతుంది.. ఆ తర్వాత ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

ఇదిలా ఉంటే.. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవంతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రతిష్టకు సూచికగా భావిస్తూ ఉంటారుజ. దీని వల్ల, సూర్యుని ఈ రాశి సంచారం మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. నెల రోజుల పాటు వీరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో విశేష ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులవారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి: 
మిథున రాశి వారికి సూర్యుని ఎఫెక్ట్‌తో ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కార్యాలయంలో మీరు ఎంతో కాలంగా పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు కూడా చాలా వరకు లభిస్తుంది. మీ సలహాలు, అభిప్రాయాలకు పైఅధికారుల నుంచి అద్భుతమైన సపోర్ట్ కూడా లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు తప్పకుండా కుదిరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కన్యా రాశి: 
కన్యా రాశి వారికి ఈ సమయం మానసిక ప్రశాంతతను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గత కొంతకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి ఈ సమయంలో తప్పకుండా ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతాయి.

మకర రాశి: 
మకర రాశి వారికి సూర్యగ్రహ సంచారం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కూడా ఎంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని శుభవార్తల కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కీలక బాధ్యతలు కూడా కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో పెట్టిన పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు కలుగుతాయి..

కుంభ రాశి: 
కుంభ రాశి వారికి సూర్యుడి ప్రభావం కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులను కూడా తీసుకు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పని ప్రదేశంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మరింత మెరుగుపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం కొత్త కొత్త అవకాశాలు కూడా కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. ఎంతో కాలంగా ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగస్తులకు తప్పకుండా గుడ్‌న్యూస్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES