గురు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు!
Sun Transit 2026: నవంబర్ ఆరవ తేదీన వైశాఖ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు చాలా రోజుల తర్వాత ఈ నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం కారణంగా ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి ఉద్యోగాల్లో దిమ్మతిరిగే ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Sun Transit 2026 Effect: అన్ని గ్రహాలకు సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు.. అందుకే ఈ గ్రహాన్ని చాలా శక్తివంతమైన శుభప్రదమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే సూర్య గ్రహాన్ని ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం, ప్రతిష్ట, నాయకత్వ లక్షణాలకు సూచికగా భావిస్తూ ఉంటారు. ఈ గ్రహం ప్రతినెల రాశి సంచారంతో పాటు అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తూ.. ఉంటుంది. ఈ రెండు సంచారాలకు కూడా చాలా అద్భుతమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే నవంబర్ ఆరవ తేదీన బుధుడు వైశాఖ నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు.. ఈ వైశాఖ నక్షత్రానికి గురుడు అధిపతిగా వ్యవహరిస్తూ వస్తాడు. అలాంటిది ఈ సూర్యుడు గురు నక్షత్రంలోకి చాలా రోజుల తర్వాత సంచారం చేయడం చాలా విశేషమని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై గురుగ్రహం ఎఫెక్ట్ తో పాటు సూర్యుడి ప్రభావం చాలా వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయని.. జీవితంలో అద్భుతమైన ఆనందం కూడా లభించబోతుందని ఆయన తెలుపుతున్నారు. అయితే, సూర్యుడు గురుడి నక్షత్రం లోకి ప్రవేశించడం కారణంగా అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి...
వీరికి లాభాలే, లాభాలు..
మేషరాశి
గురుడి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉండబోతోంది.. నవంబర్ ఆరవ తేదీ నుంచి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు పరంగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. అలాగే ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన ప్రశంసలు లభించబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా కూడా మారబోతోంది. అలాగే పొదుపు చేయాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఆత్మవిశ్వాసం పెరగడంతో వ్యాపారాలు చేసేవారు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు సాగడం వల్ల దిమ్మతిరిగే ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి..
సింహరాశి
సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు.. అలాంటిది ఈ గ్రహం వైశాకా నక్షత్రం లోకి ప్రవేశించడం కారణంగా వీరికి ఎన్నో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి.. వృత్తిరీత్యా విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వ్యక్తులకు అద్భుతమైన పదోన్నతులు లభించి కొత్త కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి కీర్తి, ప్రతిష్టలు చాలావరకు లభించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీరికి విపరీతమైన బ్యాంకు బ్యాలెన్స్ పెరగడమే కాకుండా సామాజిక గౌరవం కూడా లభించబోతోంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వైశాఖ నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఉద్యోగాలపరంగా ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రమోషన్స్ కూడా లభించే.. ఛాన్సులు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పాత ఉద్యోగాలను వదిలి కొత్త ఉద్యోగాలు వెతుక్కునే ఛాన్సులు కనిపిస్తున్నాయి.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు గొప్ప గొప్ప పరిష్కారం లభించబోతోంది. అలాగే ఆర్థికపరంగా వస్తున్న ఎన్నో రకాల సమస్యలు తొలగిపోబోతున్నాయి. దీంతోపాటు వ్యాపారాలను విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు.
NOTE: