• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: చంద్రబాబు సిగ్గుండాలి.. పులివెందుల దాడి ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: చంద్రబాబు సిగ్గుండాలి.. పులివెందుల దాడి ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan on Pulivendula incident: పోలీసులు దగ్గరుండి కూటమి నేతలకు సహకరిస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. వైసీపీ ఏంజెట్ లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

Written ByInamdar Paresh
Published: Nov 01, 2026, 12:01 PM IST|Updated: Nov 01, 2026, 12:16 PM IST
joinshare
YS Jagan: చంద్రబాబు సిగ్గుండాలి.. పులివెందుల దాడి ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: chandrababunaidu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!

నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!

2

పోలీస్ స్టేషన్‌లోనే భారీ చోరీ.. రూ.12 లక్షల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్!

3

నవంబర్ మొదటి వారంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు?

4

ఉద్యోగులకు డబుల్ ధమాకా.. 3 శాతం DA, డీఆర్ పెంపుతో పాటు దీపావళి బోనస్..

5

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. ఏకంగా నరకానికి టికెట్ కన్ఫామ్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan slams on cm Chandrababu naidu over pulivendula violence: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఉదయం నుంచి కడప, పులివెందులలో టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడులు జరిగాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో తమను వెళ్లనివ్వలేదని వైసీపీ పోలింగ్ ఏజెంట్లు నిరసనలకు దిగారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ కార్యకర్తలకు సహకరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులకు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల ఘటనలపై స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 

 

ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా జ‌రిపిస్తారు..? 70 మంది ఏజెంట్ల‌ను తీసుకొని రిట‌ర్నింగ్ అధికారికి వెళ్తాం పోలింగ్ బూత్‌ల‌లో ఏజెంట్ల‌ను కూర్చోనివ్వ‌కుండా ఏర‌కంగా పోలింగ్ జ‌రిపిస్తున్నారో రిటర్నింగ్ ఆఫీసర్‌ను అడుగుతా - మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ https://t.co/2BeNt3LvrX

— Telugu Feed (@Telugufeedsite) November 1, 2026

 

ఈ క్రమంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలు పూర్తిగా అరాచకం జరుగుతుందన్నారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ వారికి సహా కరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో ఉద్దేష్య పూర్వకంగా వెళ్లకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల అధికారులు, కలెక్లర్లు, ఎస్పీలకు ఫోన్ చేసిన ఈ అరాచకాల్నిఅడ్డుకునే నాథుడేలేడని వాపోయారు. 

చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన హెలికాప్టర్ ల్యాండ్ కాకుండా కుట్రలు చేశారన్నారు. ఏవియేషన్ అధికారులతో మాట్లాడి అప్పటికే  నా ఛాపర్ టేకాఫ్ అయ్యిందని వేరే పరిస్థితులులేక తమకు ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఎన్నికలను రద్దు చేయాలి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 

నా ఇల్లు ఇక్కడ నా ఓటు ఇక్కడ కాబట్టి.. ఈ ఒక్క పోలింగ్ బూత్ లో మాత్రమే ఏజెంట్లను కూర్చోబెట్టారన్నారు. చంద్రబాబు నిజంగా నీకు సిగ్గు ఉండాలని, సమాజానికి నువ్వు ఎలాంటి మెస్సెజ్ పంపిస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. 80 పోలింగ్ బూతుల్లో ఏజెంట్స్ లేరని, దొంగ ఓట్లును యాధేచ్చగా వేస్తున్నారన్నారు. పోలింగ్ బూత్‌ల‌లో ఏజెంట్ల‌ను కూర్చోనివ్వ‌కుండా ఏర‌కంగా పోలింగ్ జ‌రిపిస్తున్నారో రిటర్నింగ్ ఆఫీసర్‌ను అడుగుతానంటూ జగన్ మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలు ఆక్రమించి, ప్రజలను భయబ్రాంతాలుకు గురి చేస్తున్నారని, మహిళలును బేదిరిస్తున్నారని, పోలీస్ లు సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Elections
Chandrababu Naidu