SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

శుక్రుడి వక్ర సంచారంతో 3 రాశులకు జాక్‌పాట్.. అప్పుల బాధల నుంచి విముక్తి?

Venus Retrograde 2026: అక్టోబర్ 3 నుంచి శుక్రుడి వక్రగతిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 29, 2026, 03:12 PM IST | Updated: Sep 29, 2026, 03:14 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Venus Retrograde 2026: జ్యోతిష్య శాస్త్రంలో సంపద, విలాసాలు, ప్రేమ, వాహన సౌఖ్యానికి కారకుడిగా భావించే శుక్రగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శుక్రుడు తులా రాశిలో వక్రగతి(Venus Retrograde)లోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు 42 రోజుల పాటు శుక్రుడు ఇదే స్థితిలో సంచార దశలో కొనసాగిస్తాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా అప్పటి వరకు ఆయా రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. శుక్రుడి అనుగ్రహంతో ఆయా రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. అయితే, అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వృషభ రాశి (Taurus):
వృషభ రాశికి అధిపతిగా భావించే శుక్రుడు వక్రగతిలో సంచార దశలో కొనసాగడం వల్ల ఈ సొంత రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా వస్తున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అప్పుల బాధలు కూడా సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిలిపోయిన పనులు కూడా వేగంగా పుంజుకుని మానసిక ప్రశాతంత కూడా సులభంగా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి (Libra):
తులారాశిలోనే శుక్రుడు వక్రగతిలోకి వెళ్లడం వల్ల వీరికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆదాయ మార్గాలు కూడా సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఆదనపు ఆదాయ వనరులు కూడా సులభంగా పొందుతారు. ఆర్థిక సిరత్వం కూడా ఎంతో సులభంగా మెరుగుపడుతుంది. సొంత ఇళ్లు లేనివారికి ఈ సమయం ఎంతో లాభాదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

మీన రాశి (Pisces):
మీన రాశివారికి కూడా శుక్రుడి ప్రభావంతో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా విపరీతంగా పెరిగి.. వ్యాపారాల్లో బోలేడు లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా రావాల్సిన మొండి బాకీలు కూడా సులభంగా చేతికి అందుతాయి. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా సులభంగా లభిస్తాయి. ఊహించని స్థాయిల కంటే ఇప్పుడు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. తప్పకుండా కొత్త ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకుంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES