SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

శుక్రుడి సంచారంతో మాలవ్య మహాపురుష రాజయోగం.. 3 రాశులకు ధనలక్ష్మి కటాక్షం!

Venus Transit: నవంబర్ 22వ తేదిన శుక్రుడు సొంతం రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 10:39 IST | Updated: Nov 18, 2026, 10:40 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Venus Transit in Libra on November 22: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సంపద, విలాసాలు, ప్రేమతో పాటు సుఖసంతోషాలకు శుక్రుడిని సూచికగా భావిస్తూ ఉంటారు.. శుక్ర గ్రహం త్వరలోనే తులారాశిలోకి సంచారం చేయబోతోంది.. నవంబర్ 22వ తేదిన కన్యారాశిని వదిలి పెట్టి.. తులారాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహం 2027 జనవరి 1వ తేది వరకు అక్కడే కొనసాగుతాడు. శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల ఎంతో శక్తివంతమైన మాలవ్య మహాపురుష రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగంతో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం కూడా విపరీతంగా పొంది.. బంపర్‌ లాభాలు సొంతం చేసుకుంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి:
శుక్రుడి సంచారం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని ప్రయోజనాలు కూడా కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయి ప్రమోషన్లతో పాటు కొత్త ఆఫర్ లెటర్లు కూడా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

సింహ రాశి:
ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం సింహ రాశి వారికి ఊహించని పురోగతిని అందిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. వ్యాపారాలు చేసేవారికి ఆకస్మికంగా ప్రయోజనాలు కూడా కలుగుతాయి.. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి బంపర్‌ ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉండిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కార్యాలయంలో అనవసరపు రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.. లేకపోతే కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చే చాన్స్‌లు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా పూర్తిగా తొలగిపోతుంది.. చేతికి అందాల్సిన డబ్బు సకాలంలో అందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

మేష రాశి:
మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ధన లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగాల్లో వస్తున్న వివాదాల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. వీరికి భారీ మొత్తంలో జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు నుంచి భారీ లాభాలు కూడా సులభంగా కలుగుతాయి.. ఈ సమయం చాలా వరకు అద్భుతంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES