• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రాంతాల్లో మద్యం ఎందుకు సమర్పిస్తారు?

దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రాంతాల్లో మద్యం ఎందుకు సమర్పిస్తారు?

Goddess Durga Worship Traditions: కొన్నిచోట్ల అమ్మవారికి దసరా నవరాత్రులలో భాగంగా మద్యం సమర్పిస్తూ ఉంటారు. రౌద్రరూపం కలిగిన అమ్మవార్లను శాంతింప చేయడానికి ఇలా సమర్పిస్తారని.. తాంత్రిక పద్ధతిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మద్యం సమర్పించడం వల్ల ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 02:06 PM IST|Updated: Oct 19, 2026, 02:08 PM IST
joinshare
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ప్రాంతాల్లో మద్యం ఎందుకు సమర్పిస్తారు?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
DJ Sound Death: సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్‌కు కుప్పకూలిన మహిళ.. పండుగ ఆనందం ఆవిరి

DJ Sound Death: సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్‌కు కుప్పకూలిన మహిళ.. పండుగ ఆనందం ఆవిరి

2

దీపావళికి ముందే రైతుల ఖాతాల్లోకి రూ.2,000? 24వ విడత సొమ్ము వచ్చేది వారికే!

3

CM Chandrababu naidu: భరించలేని తనమా..?.. ఉన్మాదమా..?.. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

4

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను అస్స‌లు తిన‌కూడదు..!

5

‘జైలర్ 2’ సహా 2026లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఇవే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Goddess Durga Worship Traditions: భారతీయ ఆలయాల్లో దేవుడికి పాలతోపాటు పేనే కొబ్బరినీళ్లు పండ్లతో అభిషేకం చేయడం సర్వసాధారణం.. కానీ దసరా సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా కొన్ని క్షేత్రాల్లో మాత్రం పూజా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ నైవేద్యంగా కొబ్బరికాయలు మాత్రమే కాకుండా.. విస్కీతోపాటు బ్రాందీ, రమ్ వంటి మద్యం బాటిళ్లు భార్యలు తీరుతూ ఉంటాయి.. అవును వినడానికి వింతగా ఉన్న.. నమ్మశక్యం కానట్లు అనిపించినప్పటికీ శతాబ్దాల తాంత్రిక ఆచారాలకు ఇది సజీవని దర్శనంగా నిలుస్తూ వస్తోంది. అయితే అమ్మవారికి ఎక్కడ మద్యం సమర్పిస్తారు? సమర్పించడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ సాంప్రదాయంలో పూజలు రెండు మార్గాల్లో చేస్తూ ఉంటారు. ఒకటి లోక సాధారణమైన దక్షిణాచారం.. దీనినే సాత్విక పద్ధతిగా భావిస్తూ ఉంటారు.. ఇక రెండవది నిగూఢమైన వామాచారం.. ఈ ఆచారాన్ని తాంత్రిక పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటారు. కాళికాదేవితో పాటు జార చండికా భైరవి వంటి ఉగ్రదేవతలు దుష్ట సంహారం చేసిన తరుణంలో.. అమ్మవారి ఉద్రేక తీవ్రతను తృప్తి పరచడానికి రక్తం లేదా సురను సమర్పించే వారిని తాంత్రిక శాస్త్రం చెబుతోంది. అయితే ఇది మానవానికి మధ్య మత్తు కలిగించే పదార్థమే అయినా.. తంత్ర సాధనలో దీనిని మానవ అహంకారాన్ని.. భ్రమలను దేవత ముందుగా దహించి వేయడానికి ఒక సాధనంగా చూస్తూ ఉంటారట..

విజయదశమి అర్ధరాత్రి సమయంలో జరిగే ఈ విశేష పూజలు అర్చకులు వేదమంత్రాలతో పాటు బీజాక్షరాలను పఠిస్తూ.. అమ్మవారి యంత్రం లేదా విగ్రహం ముందు మద్యాన్ని పాత్రలో నింపుతూ ఉంటారట. భక్తులు తమ స్తోమతను బట్టి తెచ్చిన విదేశీ మద్యం సీసాలను తెరిచి. అమ్మవారి పాదాల వద్ద తర్పణంగా విడుస్తారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ  మద్యాన్నే పరమ పవిత్రమైన మహాతీర్థం గా భావించి భక్తులు కళ్ళకు అద్దుకొని తీసుకుంటూ ఉంటారట..

ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులతో పాటు దృష్టి దోషాలు.. శత్రువుల భయాలు తొలగిపోవాలంటే రౌద్ర దేవతలకు ప్రియమైన ఇటువంటి తర్పణాలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని తాంత్రిక పూజలు చేసే వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఉజ్జయినితోపాటు అస్సాం బెంగాల్లోని పలు తాంత్రిక శక్తి పీఠాలతోపాటు దక్కన్ పీఠభూమిలోని కొందరు గ్రామ దేవతల సన్నిధిలోను దసరా సందర్భంగా ఈ ఆచారం క్రమం తప్పకుండా జరుగుతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Spirituality