Ap cm chandrababu naidu fires on ys jagan: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హీట్ రాజుకుంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ సమయంలోనే పరస్పరం దాడుల ఘటనలతో ఏపీలోని పలు ప్రాంతాలు అట్టుడుకిపోతున్నాయి. మరోవైపు ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో ఎన్నికల సంఘం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందని, అసలు రాజ్యాంగం, చట్టం ఏమైన ఉందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ కు కౌంటర్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు.
స్థానిక ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. వైసీపీ కావాలని ఏపీలో నామినేషన్ వేళ శాంతి భద్రతలను దెబ్బతీయడానికి కుట్రలు చేసిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కూటమి అభ్యర్థులు భారీ విజయంతో గెలుస్తారని జోస్యం చెప్పారు. అదే విధంగా.. 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించారని అదే రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో డీఎస్సీ పేరిట కోర్టులకు వెళ్లారని అక్కడ కూడా వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్, వివిధ శాఖల్లో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేశామని చెప్పుకొచ్చారు.
రాయలసీమ ఒకప్పుడు రాళ్ళ సీమ, ఎడారి.. కానీ ఇప్పుడు 'రైజింగ్ సీమ'లా ఉవ్వెత్తును ఎగిసిందని మాట్లాడారు. గ్లోవింగ్ హార్టికల్చర్ హబ్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీలతో 'రతనాల సీమ'గా మారనుందని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం చేస్తామని దీని వల్ల ఐదు రాష్ట్రాలకు నీటి సమస్యలు, గొడవలకు చెక్ పెడతామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
విశాఖపట్నంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న భూముల సమస్య పరిష్కరించామని, 60 వేల మందికి రూ.2 వేల కోట్ల విలువ గల భూములను రిజిస్ట్రేషన్ చేశామని అన్నారు. నిజం నిప్పులాంటిదని, తాము చేసిన మంచిని ఎవరు కాదనలేరని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్'తో ఫుట్ బాల్ ఆడుకున్నారంటూ గుర్తుచేశారు. ఇప్పుడు పాస్ బుక్ లో రాజ ముద్ర వేసి పంపిణీ చేస్తున్నామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి,ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు మెచ్చిన వాళ్లనే అభ్యర్థుల ఎంపిక చేసేలా కసరత్తు చేశామన్నారు. ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి ఇచ్చామని మాట్లాడారు. 'గంజాయి బ్యాచ్' వర్సెస్ 'విద్యావంతులు' అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ నెలకొందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ఎల్ నినో మొదలైన విపత్తుల్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి నీటి సమస్యలేకుండా చూస్తామన్నారు.
నిజం నిప్పులాంటిదని.. డీఎస్సీపై 200 ల సార్లు కోర్టుకు వెళ్లిన వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. అంతే కాకుండా నిజంతో ఆడుకుంటే మసి కాకతప్పదని వైసీపీకి ఏసీ సీఎం చంద్రబాబుమాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల వేసిన రోడ్లను ట్రాక్టర్లతో ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
రోడ్లను ట్రాక్టర్లతో దున్నించడం ఏ రకమైన పైశాచిక ఆనందమో లేదా ఉన్మాదమో అర్థం కావడం లేదని తిరుపతి జిల్లా ఘటనపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ..
స్థానిక సంస్థల వేళ.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించడం లేదని.. ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. మేము ప్రజలకు సేవకులం.. పెత్తందారులం కాదంటూ తెల్చిచెప్పారు. ప్రతిదానికి అధికారులను బాధ్యుల్ని చేయడం సబబు కాదని.. అధికారులతో పాటు.. ప్రజాప్రతినిధులు కూడా జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు.