SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Suchika Tariyal: ఆసియా క్రీడల్లో సంచలనం.. చరిత్ర సృష్టించిన సుచికా ఎవరో తెలుసా?

Know Who Is Suchika Tariyal: ఆసియా క్రీడల్లో కీలకమైన విభాగంలో తొలిసారి భారత జెండా రెపరెపలాడింది. ఎంఎంఏ విభాగంలో తలపడి త్రివర్ణ పతాకం ఎగురవేసిన క్రీడాకారిణి సుచికా తరియాల్‌. ఇంతకీ ఆమె ఎవరు? ఏమిటనే విషయాలు తెలుసుకుందాం.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 08:37 PM IST | Updated: Sep 21, 2026, 08:47 PM IST
Image Credit: Suchika Tariyal
Join

Suchika Tariyal: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు సాధిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌తోపాటు ఇతర ముఖ్య క్రీడా విభాగాల్లో సత్తా చాటుతుండగా.. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ)లో భారత్‌కు తొలిసారి పతకం లభించింది. ఎంఎంఏ విభాగంలో భార‌త క్రీడాకారిణి సుచికా తారియాల్ సరికొత్త‌ చరిత్ర సృష్టించింది. మహిళల ట్రెడిషనల్‌ 60 కేజీల విభాగంలో సోమవారం తలపడిన సుచికా కాంస్య పతకం కొల్లగొట్టింది. ఈ విజయంతో ఎంఎంఏ విభాగంలో భార‌తదేశానికి తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచిత‌ ఘనత సాధించింది.

ఆసియా క్రీడల్లో ఎంఎంఏకు చోటులేకపోగా.. తొలిసారి ఈ ఏడాది అవకాశం కల్పించారు. ఆసియా క్రీడల్లో తొలిసారి జరిగిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనే భారత్‌కు తొలి పతకం దక్కడం విశేషం. మూడో స్థానంలో నిలిచి‌ సుచిత భార‌త్‌కు తొలి కాంస్య ప‌త‌కాన్ని అందించి రికార్డు సృష్టించింది. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియోతో జరిగిన పోరులో సుచికా పోరాడి ఓటమి వైపు నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అదనపు సమయంలోకి వెళ్లగా.. కొద్దిపాటి తేడాతో భారత ప్లేయర్‌ సుచిక ఓటమిని చవిచూసింది.

గోల్డ్‌ మెడల్‌పై కన్నేసిన 36 ఏళ్ల  సుచిత తన శక్తి మేర ప్రయత్నించినా కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. తుది పోరుకు వెళ్లకపోవడంతో కాంస్యంతో సుచితా సరిపెట్టుకుంది. ఇక అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్టాన్‌చిమెగ్‌ బైగల్మాను 2-0తో సుచికా ఓడించి సత్తా చాటింది. దీంతో ఎంఎంఏలో భారత్‌కు పతకం దక్కించుకున్న తొలి క్రీడాకారిణిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

వివిధ క్రీడల్లోనూ 
మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సత్తా చాటడమే కాకుండా సుచికా జూడో, జియూ-జిట్సు వంటి వివిధ క్రీడల్లోనూ రాణిస్తోంది. జాతీయస్థాయి జూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సుచికా 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీపడింది. 2023 ఏషియన్‌ గేమ్స్‌లో కురాష్‌లోనూ పతకం కోసం తలపడింది. జియూ-జిట్సులో సత్తా చాటి 2024లో ఫైటింగ్‌ జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే 2017లో ఎంఎంఏలో ఎంట్రీ ఇచ్చిన సుచికా ఈసారి పతకాన్ని చేజిక్కించుకుంది.

Add Zee News as a Preferred Source

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES